Tollywood news in telugu
వెంకిమామ లేటెస్ట్ స్టిల్స్ …. వైరల్ !

రీమేక్ మూవీస్ చేసి హిట్టు కొట్టడం, వినోదాన్ని పండించే సినిమాలతో ప్రేక్షకుల మనసు దోచేయడం వెంకీ కి వెన్నెతో పెట్టిన విద్య అనే చెప్పాలి.

రేపు తన 60వ పుట్టినరోజు సందర్బంగా వెంకీ తన న్యూ లుక్స్ ఫొటోస్ ని తన అభిమానులతో పంచుకున్నాడు.

వెంకటేష్ పెద్ద నిర్మాత అయినటువంటి రామానాయుడు కొడుకు, అయినాకని తన సింపిల్సిటీ తో ప్రజల మనసును దోచుకున్నాడు.
వెంకీ మొదటి చిత్రం ‘కలియుగ పాండవులు ‘ . హీరో కావాలని ఎపుడు అనుకోలేదు కానీ రాఘవేంద్రరావు దర్శకత్వం లో ఒక హీరో హ్యాండ్ ఇవ్వడంతో విదేశాల్లో చదువుకుంటున్న వెంకీ పిలిపించి హీరో గా చేయించారు రామానాయుడు.

వెంకీ కెరీర్ ప్రారంభంలోనే తన సినిమాలు హిట్లు కొట్టడంతో ఫుల్ టైం హీరో గా వెండితెరకు తన జీవితాన్ని రాసిచ్చేసాడు. అప్పట్లో కొన్ని సినిమాలు హిట్లు కొట్టడంతో ఒక స్టార్ హీరో గా ఎదిగాడు.