Tollywood news in telugu

త్వరలో ఆ స్టార్ హీరో ఇంట్లో పెళ్లి భాజాలు??

టాలీవుడ్ లో విక్టరీనే తన ఇంటి పేరుగా మార్చుకున్న స్టార్ హీరో ప్రముఖ నిర్మాత  దగ్గుబాటి రామానాయుడు రెండవ కుమారుడు విక్టరీ వెంకటేష్. ఈ సీనియర్ స్టార్ హీరో ఎన్నో సంవత్సరాల తరువాత తిరిగి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీస్ కి శ్రీకారం చుట్టాడు. ప్రిన్స్ మహేష్ బాబుతో కలిసి “,సీతమ్మ వాకిట్లో”, హీరో రామ్ తో మసాలా మూవీస్ చేసాడు. తాజాగా వరుణ్ తేజ్ తో F2 మూవీలో నటిస్తున్నాడు. అంతే కాకుండా త్వరలోనే తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి “వెంకీ మామ” అనే సినిమా కూడా చేయబోతున్నాడు వెంకటేష్. అయితే ఇప్పుడు మన విక్టరీ వెంకటేష్ గారు ఈసారి నిజంగానే మామ కాబోతున్నాడు. నిజమండీ.. వెంకటేష్ తన పెద్ద కూతురు asritaకు పెళ్లి చేయబోతున్నాడు. దీనికి సంభందించి ఇప్పుడు ఫిలింనగర్ లో ఒక న్యూస్ వినిపిస్తుంది.

విక్టరీ వెంకటేష్ కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. కొడుకు అర్జున్ ఈ మధ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపిస్తున్నాడు. వెంకటేష్ తన ఫ్యామిలీ లైఫ్ ని ఎల్లప్పుడు మీడియాకు, చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంచుతారు. చాలా మందికి వెంకటేష్ గారి పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా తెలియదు అనే చెప్పాలి. మరీ ముఖ్యంగా పిల్లలను మీడియాకు చాలా దూరంగా ఉంచుతారు. ఎలాంటి పబ్లిక్ ఫంక్షన్లు, ఆడియో వేడుకలు మొదలైన వాటికి పిల్లలను తీసుకెళ్లేవారు కాదు. ఇప్పుడు సడెన్ గా కూతురు పెళ్లి అనేసరికి, వెంకటేష్ కు ఇంత పెద్ద కూతురు ఉందా అని కూడా చాలామంది షాక్ అవుతున్నారు.

Read  milky beauty Tamannaah : మెగా ప్రిన్స్ తో మిల్కీ బ్యూటీ

నిజానికి వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత బేకరి రంగంలో వృత్తి నిపుణురాలిగా ట్రైనింగ్ తీసుకుంది. వెంకీ కూతురు asrita హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడితో గత కొంతకాలంగా లవ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విష‌యాన్ని త‌న కుటుంబ స‌భ్యుల‌కి చెప్ప‌డంతో వారు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. దీంతో పాటు వీళ్లకు చాలా వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఈ సంబంధం దాదాపు కన్ఫర్మ్ అయ్యినట్టు ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

సో ఇది లవ్ కమ్ ఎరేంజ్డ్ మ్యారేజ్ అన్న మాట. వెంక‌టేష్ అన్న సురేష్ బాబు ఇప్ప‌టికే అబ్బాయి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారని త్వ‌ర‌లో వీరిద్దరి నిశ్చితార్దం జ‌ర‌గ‌నుంద‌నే వార్త సోష‌ల్ మీడియాలో షికారు చేస్తోంది. కాని వెంకీ కూతురు asrita ప్రేమ పెళ్లి విష‌యంపై ఇప్ప‌టి వ‌ర‌కు వెంకీ కుటుంబ స‌భ్యులు ఎవ‌రు రియాక్ట్ కాలేదు, కాబట్టి ఇంత‌లో ఎంత వరకు నిజం ఉంద‌నే విషయం తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే త్వరలో వెంకీ ఇంట్లో పెళ్లి భాజాలు మోగడం ఖాయం.

Read  ishq 2021 telugu movie - ఇష్క్ (2021)

 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button