Tollywood news in telugu
Varun Tej: నెగిటివ్ ఇంత ఆనందం ఉంటుందా…!

Varun Tej: ఎప్పుడైనా నెగిటివ్ ని పాజిటివ్ లాగా తీసుకుంటే ఆ నెగటివ్ అనేది పోతుందని కొందరు చెబుతుంటారు. కానీ అదే పాజిటివ్ నుంచి నెగిటివ్ గా మారితే ఇంత ఆనందంగా ఉంటుందని తాను ఎప్పుడూ అనుకోలేదన్ని హీరో వరుణ్ తేజ్ అంటున్నాడు.

తాజాగా హీరో వరుణ్ తేజ్ కి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వరుణ్ తేజ్ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు.దీంతో మళ్ళీ కరోనా పరీక్షలు చేయించుకోగా… నెగిటివ్ వచ్చినట్లు వరుణ్ వెల్లడించారు. ఈ మేరకు తనకు కరోనా నెగిటివ్ రావడం చాలా ఆనందంగా ఉందని వరుణ్ తేజ్ అన్నారు. గత కొద్ది రోజుల నుండి హోమ్ క్వారంటైన్ లో ఉంటే తనకు బోరింగ్ అనిపించిందని, మళ్ళీ చిత్ర షూటింగ్లో పాల్గొనడం సంతోషమని వరుణ్ తేజ్ అన్నారు.