Tollywood news in telugu

Varun Tej Ghani release Date finalized : మొత్తానికి విడుదల తేదీ ఫిక్స్ చేసుకున్న వరుణ్ తేజ్ గని ? :-

Varun Tej Ghani release Date finalized

Varun Tej Ghani release Date finalized : మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరోలలో వరుణ్ తేజ్ ఒకరు. కాకపోతే వరుణ్ తేజ్ రూట్ ఏ సెపెరేట్. మొదటి సినిమా నుంచి ఇప్పటిదాకా కథనే నమ్మి సినిమా తీసే హీరో. సినిమా హిట్ ఆ ప్లాప్ ఆ అని చూడకుండా డిఫరెంట్ గానే చేస్తూ వచ్చారు , వస్తున్నారు కూడా.

ఇపుడు కూడా వరుణ్ తేజ్ గని అనే బాక్సింగ్ కాన్సెప్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఎపుడో విడుదల అవ్వాల్సింది, కాకపోతే కరోనా కారణంగా విడుదల కాకుండా ఆగిపోయిన సినిమాలలో ఇది ఒకటి.

ఇపుడు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ సినిమా డిసెంబర్ 3 న విడుదల చేయాలనీ చిత్రబృందం నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఇండస్ట్రీ మొత్తం ఇదే హాట్ టాపిక్ గా మారింది. త్వరలో ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించనున్నారు.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ నెవెర్ బిఫోర్ లుక్ లో కనిపించబోతున్నారు. బాక్సింగ్ స్టేజి లో వరుణ్ ఉన్న ఫోటోలు చూస్తేనే అర్ధం అయిపోతుంది.

ఇదిలా ఉండగా డిసెంబర్ నెలలోనే మెగా ఫ్యామిలీ నుంచి బన్నీ పుష్ప , చిరు ఆచార్య , ఇపుడు వరుణ్ తేజ్ గని వస్తున్నాయి. ఒకే నెలలో 3 మెగా హీరోల సినిమాలు వస్తున్నాయి అన్న వార్త వినగానే అభిమానులు వారి ఆనందాన్ని ట్విట్టర్ లో చిత్రబృందాలని ట్యాగ్ చేస్తూ వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి డిసెంబర్ లో విడుదల కాబోతున్న వరుణ్ తేజ్ గని సినిమా అభిమానులను ఏ రేంజ్ లో అలరించబోతుందో.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button