Today Telugu News Updates
Varun Dhawan: పెళ్లి పీటలు ఎక్కబోతున్న బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్

బాలీవుడ్లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, బద్లాపూర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో వరుణ్ ధావన్ ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్ననాడు.

వరుణ్ చిన్ననాటి స్నేహితురాలైన నటిషా దలాల్ ని పెళ్లాడబోతున్నడు. అసలైతే వీళ్ళ పెళ్లి జూన్ 2019 లోనే కావాల్సి ఉండగా.. కరోనా దృష్ట్యా వివాహం వాయిదా పడింది. తాజాగా మళ్ళీ ఈ పెళ్లి తంతును ఐదు రోజుల పాటు అలిబగ్ లో జరిపేందుకు ఇరు కుటుంబాలు సిద్ధమవుతున్నారు. ఈ నెల 22 నుంచి 26 వరకు జరిగే ఈ వివాహానికి బంధుమిత్రులకు ఆన్లైన్ లో ఆహ్వానపత్రికను పంపారు.

ఇటీవలె వరుణ్ ధావన్ నటించిన కూలి నెంబర్ వన్ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.