Varudu Kavalenu Movie Review 2021

Movie :- Varudu Kavalenu (2021) Review
నటీనటులు :- నాగ శౌర్య , రీతు వర్మ , వెన్నెల కిషోర్ , మురళి శర్మ , నదియా
నిర్మాతలు :- సూర్య దేవర నాగ వంశీ
సంగీత దర్శకుడు :- విశాల్ చంద్రశేఖర్
డైరెక్టర్ :- లక్ష్మి సౌజన్య గోపాల్
Release Date: 29th October 2021
- ముఖ్య గమనిక :- ఈ వెబ్ సైట్ లో రాసిన లేదా రాయబోయే ప్రతి ఆర్టికల్ / రివ్యూస్ మా సొంత అభిప్రాయం తో రాసినది. డబ్బులకి రేటింగ్స్ ఇచ్చే సైట్ కాదని గమనించవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా మా వెబ్ సైట్ రివ్యూస్ లింక్స్ ఫార్వర్డ్ చేసి మీకు పంపి డబ్బులు తీసుకున్నచో మాకు సంబంధం లేదు. అలాంటి చర్యలకు ఎవరైనా పల్బడితే తగ్గినా చట్టరీత్య చర్యలు తీసుకొన బడును. ఏమైనా సందేహాలు ఉంటె teluguvision1@gmail.comil.com కి మెయిల్ చేయండి. be aware of frauds and fake people
Story ( Spoiler Free ) :-
ఈ కథ భూమి ( రీతూ వర్మ ) పెళ్లిచూపులు సీన్ తో మొదలవుతుంది. భూమి కి పెళ్ళి అంటేనే ఇష్టం ఉండదు. ఇదిలా ఉండగా భూమి ధరణి ఎకో ఫ్రెండ్లీ బిజినెస్ రన్ చేస్తుంటది. ఇంకో పక్క దుబాయ్ లో శౌర్య ని ఆర్కిటెక్ట్ గా చూపిస్తూ దుబాయ్ నుంచి ప్రాజెక్ట్ పనిమీద ఇండియా కి వచ్చే సన్నివేశాలు ఉంటాయి. దీనితోపాటు భూమి పెళ్లిచూపుల సన్నివేశాలు కూడా జరుగుతున్నాయి.
భూమి చాల స్ట్రిక్ట్. నాగ శౌర్య ( ఆకాష్ ) భూమి కంపెనీలోని ప్రాజెక్ట్ టేక్ అప్ చేస్తాడు. కాలానుసారం ఆకాష్ కి భూమి పై ఫీలింగ్స్ మొదలయి ప్రేమలో పడుతాడు. అస్సలు పెళ్ళి అనే కాన్సెప్ట్ ఏ ఇష్టం లేని భూమి ని ప్రేమలో దింపేందుకు ఆకాష్ అనేక ప్రయత్నాలు చేస్తారు. ఇద్దరికీ ఒక్కరంటే ఒకరికి ఎంతగానో ఇష్టం కానీ కొని అనుకోని కారణాల చేత ఆకాష్ భూమి సెపెరేట్ అయిపోతారు.
అసలు భూమి ఎందుకు స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తోంది ? పెళ్ళి అంటే ఎందుకు ఇష్టం లేదు ? ఆకాష్ భూమి ని ప్రేమలో దింపేందుకు చేసే ప్రయత్నాలు ఏంటి ? ఆకాష్ భూమి ఒకరిమీద ఒకరికి ప్రేమ పెంచుకొని ఎందుకు విడిపోవాల్సి వచ్చింది ? వీరిద్దరి మధ్య గతం లో ఏమైనా సంబంధం ఉందా ? చివరికి ఆకాష్ భూమి కలుసుకుంటారా లేదా ? వారి మధ్య వచ్చిన విబేధాలు తొలిగిపోతాయా లేదా ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్లో చూడాల్సిందే.
Positives 👍 :-
- నాగ శౌర్య , రీతు వర్మ కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమా మొత్తం వీరిద్దరి నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఆన్ స్క్రీన్ లో వీరిద్దరి జంట అందరిని ఆకటుకుంటుంది.
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
- కథ మరియు కథనం ముఖ్యంగా రెండు భాగాలలో కామెడీ పర్ఫెక్ట్ గా పెట్టారు.
- లక్ష్మి శౌజన్య గోపాల్ దర్శకత్వం మరియు డైలాగ్స్ ముఖ్యంగా మురళి శర్మ సెకండ్ హాఫ్ లో చెప్పే డైలాగ్స్ ఆలోచింపచేసేలా ఉంటాయి.
- సినిమాటోగ్రఫీ బాగుంది.
- ఎడిటింగ్ బాగుంది.
Negatives 👎 :-
- రెండు పాటలు ఆన్ స్క్రీన్ లో తప్ప మిగితవి పెద్దగా అలరించవు.
- కాస్త స్లో గా ఉంటుంది.
- సరైన కాన్ఫ్లిక్ట్ లేకపోవడం.
Overall :-
మొత్తానికి వరుడు కావలెను అనే సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచుతుంది అనే విషయం లో ఎటువంటి సందేహం లేదు. సినిమా మొదటినుంచి చివరిదాకా కధనం బాగా నడిపారు. లక్ష్మి సౌజన్య దర్శకత్వం ప్రేక్షకులని అలరిస్తుంది. ముఖ్యంగా నాగ శౌర్య మరియు రీతూ వర్మ పెరఫార్మసి కెరియర్ బెస్ట్ ఇచ్చారు. నదియా , మురళి శర్మ గారి డైలోగ్స్ , స్క్రీన్ ప్రెజన్స్ ప్రేక్షకులని ఆలోచింపచేసేలా చేస్తుంది.
కథ మరియు కధనం బాగుంది. రెండు భాగాలలో కామెడీ సన్నివేశాలన్నీ కథనుసారం పర్ఫెక్ట్ గా ప్లేస్ చేశారు. పాటలు ఆన్ స్క్రీన్ లో రెండు బాగుంటాయి మిగితావి సో సో గా అనిపిస్తుంది. అంత బాగున్నప్పటికీ కాన్ఫ్లిక్ట్ పాయింట్ సరిగ్గా రాసుకోలేకపోయారు. సినిమా కొంచెం స్లో గా సాగుతుంది. సినిమాటోగ్రఫీ మరియు నిర్మాణ విలువలు గ్రాండియర్ గా కనిపిస్తుంది.
మొత్తానికి వరుడు కావలెను సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచుతుంది యువత యావరేజ్ గా నిలుస్తుంది. ఈ వారం కుటుంబం అంత కలిసి ఓసారి సరదాగా చూసేయచు.
Rating :- 2.75/5