నాగార్జునని కుడా వదలని వర్మ!

Varma inovlves nagarjuna in gaddithintava ? గడ్డితింటావా అంటూ సాగే ఓ పాటలో నాగార్జున ని కుడా ఎంటర్ చేసాడు, పులిలాంటి వాణ్ణి పిల్లిలా చేశారా అంటూ వచ్చే వాయిస్ అచ్చు నాగార్జునని పోలి ఉంది , అయితే ఇందులో నాగార్జునని తీసుకొచ్చే అవసరం ఎందుకొచ్చింది తనపైన పర్సనల్ గా ఏమైనా కోపం ఉండి ఉంటుందా అనే అనుమానం కలుగక మానదు .
ఇప్పటివరకు వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ లానే మీడియా దృష్టిలో కనిపించారు , వర్మ కుడా నాకు లైఫ్ ఇచ్చింది నాగార్జున అనే చెప్పుకుంటాడు, కానీ మరి ఇపుడు మరి బర్రె మాట్లాడుతున్న వాయిస్ లో నాగార్జున గొంతు పెట్టడం నాగార్జున ఫాన్స్ కి షాకింగ్ గానే ఉంది , నాగార్జున తో తీసిన చివరి సినిమా ఆఫీసర్ ఫెయిల్ అయ్యాక వీళ్లిద్దరి మధ్యన మనస్పర్థలకు దారితీసాయ ?
ఇప్పటికి బాలక్రిష్ణని , చిరంజీవిని , పవన్ కళ్యాణ్ ని వాళ్ళ లిస్ట్ లో లైఫ్ ఇచ్చిన నాగార్జున కుడా చేరిపోవడం సగటు సినిమా
అభిమానికి షాక్ ఇచ్చినట్టైంది , బి గ్రేడ్ మూవీస్ కి దిగజారిన వర్మ , ఈ పైత్యం తో ఇంకెన్ని రోజులు నెట్టుకొస్తాడో చూడాలి .
మరింత అనాలసిస్ చేసినట్టయితే వర్మ OTT ప్లాట్ ఫోర్మ్స్ కి ఫిక్స్ అయ్యాడనిపిస్తుంది , ఇక తన మార్కెట్ కి రెగ్యులర్ సినిమాలు చేసే ఉదేశ్యం లేదు గనుక ఇపుడు ఎవరితో పనిలేదనే తరహాలో ప్రవర్తిస్తున్నాడని, దాన్ని క్యాష్ చేసుకుంటున్నాడని అనుమానం కలుగక మానదు .