News

Varavara Rao gets conditional bail : గోరేగావ్ కుట్ర కేసులో ఏడాది గ జైలులో ఉన్న… వరవరరావుకు బెయిలు మంజూరైంది…!

Varavara Rao gets conditional bail

Varavara Rao gets conditional bail  : విప్లవ రచయితల సంఘం నేత వరవరరావుకు మొత్తానికి  బెయిల్‌ మంజూరైంది. ఇతనికి కొన్ని షరతులతో కూడిన మెడికల్ బెయిల్‌ను ముంబై హైకోర్టు మంజూరు చేసింది. వరవరరావున చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్వహిస్తున్నాడని ఎన్ఐఏ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

గోరేగావ్ కుట్ర కేసులో జైలుపాలైన విప్లవ కవి వరవరరావు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్బంగా ముంబై విడిచి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని కోర్టు షరతు విధించింది. 

ఇక ఇతనికి గతంలో ఆరోగ్యం బాగా క్షీణించింది. నరాల సంబంధిత వ్యాధులతో సతమతమౌతుండటంతో పాటు మరికొన్ని  అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడటంతో , ఆరు నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని  కోర్టు తెలిపింది.

బయటికి వెళ్ళాక  సాక్ష్యాల తారుమారుకు ప్రయత్నిస్తే బెయిల్ ను రద్దు చేస్తామని వరవరరావును న్యాయమూర్తి హెచ్చరించారు. ఈ రోజు  సాయంత్రం వరకు వరవర రావు బయటికి రానున్నాడు.

Read  Plastic Rice Crisis: మళ్ళీ తెరపైకి వచ్చిన ప్లాస్టిక్ బియ్యం బాగోతం...ఎక్కడంటే.. !
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button