Tollywood news in telugu
Vakeel Saab:-“వకిల్ సాబ్” క్లైమాక్స్ ఫైట్ స్టిల్స్…లీక్ చేశాడా? హాక్ అయిందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల నుండి సినిమాలకు గ్యాప్ ఇచ్చి రాజకీయాలపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ వకీల్ సాబ్ చిత్రంతో అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ మేరకు 90% చిత్ర షూటింగ్ పూర్తి కాగా… క్లైమాక్స్ ఫైట్ సీన్ హైదరాబాదులో షూట్ చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో దేవ్ గిల్ నటిస్తున్నారు. తాజాగా ఈ క్లైమాక్స్ లోని ఫైటింగ్ స్టిల్స్ ను స్వయంగా దేవ్ గిల్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. మరి ఈ స్టిల్స్ ని అతను కావాలని రిలీజ్ చేశాడా..? లేక అకౌంట్ హాక్ అయిందా అనేది తెలియదు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ స్టిల్స్ హల్ చల్ చేస్తున్నాయి


