Tollywood news in telugu

Vakeel Saab: “వకిల్ సాబ్” సినిమా టీజర్ డేట్ ఎప్పుడంటే?

చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “వకిల్ సాబ్” చిత్రంతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. కరోనా కారణంగా ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడ్డా… మళ్లీ గత కొద్ది రోజుల నుండి హైదరాబాదులో షూటింగ్ జరుగుతుంది. చిత్ర షూటింగ్ 90 శాతం మేర పూర్తయిందట. ఈ చిత్రాన్ని నూతన సంవత్సరం స్పెషల్ గా టీజర్ రెడీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. జనవరి 1న టీజర్ ని రిలీజ్ చేస్తారని సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో కథానాయికగా శృతిహాసన్ నటిస్తోంది. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ లు అంజలి, నివేదా థామస్, అనన్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు… ఎస్.ఎస్.థమన్ సంగీతం సమకూరుస్తున్నారు..

Read  'చిత్రం' సీక్వెల్ .. రాబోతుంది అంటూ వెల్లడించిన దర్శకుడు తేజ...!.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button