Tollywood news in telugu

ఉత్తర మూవీ రివ్యూ & రేటింగ్ !!!


నటీనటులు: శ్రీరామ్ నిమ్మల, కర్రోన్య కటరీన్, అజయ్ ఘోష్
సంగీతం: సురేష్ బొబ్బిలి
నిర్మాతలు: తిరుపతి ఎస్ ఆర్, శ్రీపతి గంగాదాస్
రచన, దర్శకత్వం: తిరుపతి ఎస్ ఆర్
ఛాయాగ్రహణం: చరణ్ బాబు
కూర్పు: బొంతల నాగేశ్వర్ రెడ్డి
నిర్మాణ సంస్థ: లివ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్ క్రియేషన్స్

కథ:

అశోక్ స్వాతి అనే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ ఆ అమ్మాయి ని పెళ్లి చేసుకుని పోషించేంత డబ్బు అతని దగ్గర ఉండదు. అందుకే ఎలాగైనా డబ్బులు సంపాదించాలి అని చూస్తున్నప్పుడు ‘ఉత్తర’ అనే ఒక నిధి గురించి తెలుసుకుంటాడు. కానీ ఆ నిధిని చేజిక్కించుకోవడం అనుకున్నంత సులభం కాదు. ఈ నేపథ్యంలోనే అశోక్ ఆ ఊరిలోని పెద్దమనిషి రుద్రయ్య తో చేతులు కలపాల్సి వస్తుంది. అశోక్ నిధిని చేజిక్కించుకున్నాడా? స్వాతి ని పెళ్లి చేసుకున్నాడా? చివరికి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ఈ చిత్ర కథాంశం మొత్తం ఒక ఊరిలో జరుగుతుంది. హీరో శ్రీరామ్ చాలా బాగా ఆకట్టుకుంటాడు. తన పాత్రలో ఒడిగిపోయి శ్రీరామ్ చాలా బాగా నటించాడు. కొంచెం కష్టమైన పాత్ర అయినప్పటికీ, శ్రీరామ్ చాలా బాగా నటించడమే కాక తన నటనతో అందరినీ మెప్పించాడు. కర్రోన్య కటరీన్ కూడా తన పాత్రకు పూర్త స్థాయిలో న్యాయం చేసింది. తన అద్భుతమైన నటనతో కర్రోన్య తన పాత్రకు ప్రాణం పోసిందని చెప్పుకోవచ్చు. ఇక జమీందారు పాత్రలో అజయ్ ఘోష్ కూడా చాలా బాగా నటించాడు. చాలా సహజంగా నటిస్తూ తన పెర్ఫార్మెన్స్ తో సినిమాకి మరింత బలాన్ని చేకూర్చారు. టిల్లు వేణు, అభి బేతిగంటి కూడా తమ పాత్రలకు బాగానే న్యాయం చేశారు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు.

ఈ సినిమా దర్శకుడు మరియు తిరుపతి ఎస్ ఆర్ ఈ సినిమా కోసం ఒక మంచి కథని రాసుకున్నారు. మొదటి హాఫ్ మొత్తం కామెడీ మరియు ప్రేమ కథ చుట్టూ తిరిగే సినిమా రెండవ హఫ్ లో ప్రేక్షకులను బాగానే సస్పెన్స్ లో పెడుతుంది. కథ నేరేషన్ విషయంలో తిరుపతి ఎస్ ఆర్ మంచి మార్కులు వేయించుకుంటారు అని చెప్పవచ్చు. ఏ మాత్రం బోర్ కొట్టించుకోకుండా కథని దర్శకుడు చాలా బాగా ముందుకు నడిపించారు. లివ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై తిరుపతి ఎస్ఆర్ మరియు శ్రీపతి గంగాదాస్ అందించిన నిర్మాణ విలువలు సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యాయి. సురేష్ బొబ్బిలి సంగీతం ఈ సినిమాకి ఆయువుపట్టుగా చెప్పుకోవచ్చు. పాటలు మాత్రమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో కూడా సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం సినిమాకి చాలా బాగా సహాయపడుతుంది. చరణ్ బాబు ఛాయాగ్రహణం, నాగేశ్వర్ రెడ్డి కూర్పు కూడా పర్వాలేదు అనిపిస్తుంది.

ఉత్తర మొదటి సన్నివేశం నుంచే చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. మొదటి హాఫ్ మొత్తం పూర్తిగా ఎంటర్టైన్మెంట్ మీదనే సినిమా ముందుకు సాగుతుంది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథ కూడా చాలా బాగా చూపించారు. అయితే ఇంటర్వెల్ వద్ద సినిమా కీలక మలుపు తిరుగుతుంది. సెకండ్ హాఫ్ నుండి ఈ సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుంది. నిధిని చేజిక్కించుకునే ప్రక్రియలో హీరో మరియు అతని స్నేహితులు పడే అవస్థలు చాలా బాగున్నాయి. జైల్లో వచ్చే సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బాగానే అలరిస్తాయి. క్లైమాక్స్ కూడా దర్శకుడు చాలా బాగా హ్యాండిల్ చేశారు. చివరిగా ‘ఉత్తర’ సినిమా మా ఒక మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా.

రేటింగ్: 3.5/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button