Today Telugu News Updates
అమెరికాలోని పెద్ద రాష్ట్రాలలో ముందంజలో ట్రాంప్ !

అమెరికాలో జరిగిన ఎన్నికల యొక్క రాబోయే ఫలితాలు ప్రపంచమంతటిని ఉత్కంఠనికి గురిచేస్తున్నాయి.
తాజాగా ఫ్లోరిడాలో ట్రాంప్ గెలుపును తన ఖాతాలో వేసుకున్నాడు. టెక్సాస్ లో కూడా ట్రాంప్ దే విజయం, అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టాలంటే ఈ రెండు రాష్ట్రాల లో గెలుపొందినవారికే పీఠం దక్కుతుంది.
కౌంటింగ్ ప్రారంభం నుండి ట్రాంప్ ముందంజలో ఉంటున్నారు. కానీ జో బైడెన్ కూడా ట్రాంప్ కి పోటీగా విజయానికి అతి దగ్గరలోనే ఉన్నాడు.
ట్రాంప్ వైట్‌హౌస్‌లో దాదాపు 250 మంది పార్టీ ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోందని, గెలుపు సంబరాలకు పార్టీ సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులను కోరారు. నాకు అత్యద్భుతంగా మద్దతు తెలిపినందుకు అమెరికా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భారీ విజయోత్సవానికి సిద్ధమవ్వాలని ప్రజలకి పిలుపునిచ్చారు.