Today Telugu News Updates
Shocking News: మనుషులు లేని ఎడారి ప్రాంతంలో త్రికోణ స్తంభం..ఏలియన్స్ నిర్మాణమా?

మనం త్రికోణ స్తంభన్ని జనాలు సంచరించే అమెరికా, ఇండియా ప్రాంతాల్లో ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. కానీ ఎవరు ఉండని ఎడారి ప్రాంతంలో ఓ త్రికోణ స్తంభం ఏర్పడింది.
అగ్ర దేశమైన అమెరికాలోని ఉటా రెడ్ రాక్ ఎడారిలో మీదుగా ఉటా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ అండ్ డివిజన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ అధికారులు హెలికాప్టర్ లో ప్రయాణిస్తుండగా.. వారికి ఎడారిలో ఏదో మెరుస్తున్నాటు కనబడటంతో… కిందికి దిగారు.
దాని దగ్గరికి వెళ్లి పరిశీలించగా..ఆది త్రికోణ స్తంభమని అధికారులు గుర్తించారు. కనీసం ఈ ఎడారికి రవాణా సదుపాయం కూడా లేని.. ఇంత బరువు గల త్రికోణ స్తంభాన్ని ఎవరు తీసుకువచ్చారని అధికారులు ఆశ్చర్యపోతున్నారు. దీనితో ఇది గ్రహాంతర వాసులు నిర్మించారని స్థానికుల మధ్య గుస గుసలు నడుస్తున్నాయి.