Tollywood news in telugu

క్లీన్ యు స‌ర్టిఫికేట్‌తో సెన్సార్ పూర్తి చేసుకుని ద‌స‌రా సంద‌డికి సిద్ధ‌మ‌వుతోన్న న‌వీన్ విజ‌య్ కృష్ణ `ఊరంతా అనుకుంటున్నారు`

క్లీన్ యు స‌ర్టిఫికేట్‌తో సెన్సార్ పూర్తి చేసుకుని ద‌స‌రా సంద‌డికి సిద్ధ‌మ‌వుతోన్న న‌వీన్ విజ‌య్ కృష్ణ `ఊరంతా అనుకుంటున్నారు`

`నందిని నర్సింగ్ హోమ్` చిత్రంతో కథానాయకుడిగానే మంచి గుర్తింపు తెచ్చుకొన్న నవీన్ విజయ్ కృష్ణ హీరోగా బాలాజీ సానల దర్శకత్వంలో రోవాస్కైర్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్‌పై శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `ఊరంతా అనుకుంటున్నారు`. సెన్సార్ కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ `యు` స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఈ చిత్రాన్ని ద‌స‌రా సంద‌ర్బంగా విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా …
చిత్ర నిర్మాతలు‌ మాట్లాడుతూ “మా `ఊరంతా అనుకుంటున్నారు` చిత్రం సూప‌ర్‌స్టార్ కృష్ణ నటించిన ఒకప్పటి పండంటి కాపురం, ఊరికి మొనగాడు, మహేష్ బాబు మురారి, ఇటీవలి శతమానం భవతి చిత్రాలు, అప్పటి అష్టా చ‌మ్మా లాంటి పండ‌గ సినిమాల‌ను గుర్తు చేసే మ‌రో పండ‌గ చిత్ర‌మే మా `ఊరంతా అనుకుంటున్నారు`.  కోనసీమ, చెన్నై, హైదరాబాద్ ల నేపథ్యాన్ని కెమెరామెన్ జి.ఎల్.ఎన్. బాబు అద్భుత‌మైన విజువ‌ల్స్‌తో తెర‌పై ఆవిష్క‌రించారు. అలాగే కె.ఎం. రాధాకృష్ణన్ పాటలు, నేపథ్య సంగీతం చ‌క్క‌గా కుదిరాయి. సున్నితమైన ఫ్యామిలీ కామెడీతో పాటు జయసుధ- రావు రమేష్ ల మధ్య, నవీన్ విజయకృష్ణ – శ్రీనివాస్ అవసరాల మధ్య సన్నివేశాలు భావోద్వేగాన్ని కలిగించేలా దర్శకుడు బాలాజీ సానల చిత్రీకరించారు. ఈ పండ‌గలాంటి సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.

న‌టీన‌టులు:

నవీన్ విజయకృష్ణ
శ్రీనివాస్ అవసరాల
మేఘా చౌదరి
సోఫియా సింగ్
జయసుధ
కోటా శ్రీనివాసరావు
రావు రమేష్
అన్నపూర్ణమ్మ
రాజా రవీంద్ర
అశోక్ కుమార్, ప్రభావతి
జబర్దస్త్ రామ్
జబర్దస్త్ బాబి
గౌతంరాజు
అప్పాజీ
క్రాంతి

సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం: బాలాజి సానల
నిర్మాతలు: శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డి
సంగీతం: కె.ఎం. రాధాకృష్ణన్

డి.ఓ.పి.     : జి.ఎల్.ఎన్. బాబు
ఎడిటింగ్     : మధు
కొరియోగ్రఫీ  : భాను
మేకప్ : ప్రేమ్ రాజ్
స్టోరీ : శ్రీమంగళం, రమ్య
ఆర్ట్ : కృష్ణమాయ
ఫైట్స్ : రామ్ సుంకర
పాట‌లు: వనమాలి, పెద్దాడ మూర్తి, శ్రీహరి మంగళంపల్లి
కాస్ట్యూమ్ డిజైనర్ : భార్గవీ రెడ్డి
కాస్ట్యూమర్ : నాగరాజు
ప్రొడక్షన్ మేనేజర్ : సుబ్బు ఎస్
పి.ఆర్.ఓ. : వంశీ – శేఖర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button