Tollywood news in telugu

uppena trailer : ఉప్పెన ట్రైలర్ రిలీజ్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్…!

uppena trailer

uppena trailer : వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో,హీరోయిన్లుగా నటించిన  తాజా చిత్రం ‘ఉప్పెన’. ఇపుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు  ఫిబ్రవరి 12న  రాబోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు ఈ సినిమా ట్రైలర్ ను  విడుదల చేశారు. ఉప్పెన చిత్రబృందం ఎన్టీఆర్ ను కలిసి తన చేతులమీదుగా ట్రైలర్ ని విడుదల చేయించారు. ఎన్టీఆర్ ను కలిసినవారిలో హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి, దర్శకుడు బుచ్చిబాబు సానా ఉన్నారు.

ఈ సందర్భంలో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, స్పందిస్తూ ‘ఉప్పెన’ ట్రైలర్ లాంచ్ చేసినందుకు యంగ్ టైగర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే   ఎన్టీఆర్ ఉప్పెన చిత్ర విశేషాలను అడిగి తెలుసుకొని  యూనిట్ సభ్యులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

 ఈ సినిమాకు  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, ఇప్పటికే ఈ సినిమా లోని  ‘నీ కన్ను నీలి సముద్రం’ అనే  పాట జనాల్లోకి బాగా వెళ్లింది. ఇందులో  తమిళ నటుడు విజయ్ సేతుపతి కూడా వున్నాడు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button