Tollywood news in telugu

Uppena OTT release date: ఓటిటిలో ‘ఉప్పెన’ రిలీజ్ ఎప్పుడంటే…..?

Uppena OTT release date

తెలుగు సినీ  ఇండస్ట్రీ వారందరు ఇప్పుడు ఒకేఒక్క  సినిమా గురించి మాట్లాడుతున్నారు. అదేనండి ఉప్పెన సినిమాగురించి. ఇందులో  మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమయ్యారు. ఇటు మెగాఫ్యాన్స్ సపోర్ట్ , అటు సినిమా కూడా బాగుండటంతో కలెక్షన్లు ఉప్పెనలా వచ్చి చేరుతున్నాయి.

 రెండు రోజుల్లోనే ఈ సినిమాకు ఏకంగా 18 కోట్ల వచ్చాయంటే కలెక్షన్ ఏ రేంజ్ లో ఉందొ చెప్పనక్కర్లేదు. మూడో రోజు కూడా కచ్చితంగా ఈ సినిమాకు 5 కోట్ల వసూళ్లు చేసేలా ఉంది. ఉప్పెనకి  మూడు రోజుల్లోనే ఈ సినిమాకు లాభాల పంట పండబోతుంది. ఊహించని విధంగా డ్రీమ్ డెబ్యూ దొరికేసింది వైష్ణవ్ తేజ్‌కు. బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్,   నిర్మించారు.

ఇదిలా ఉంటే ఉప్పెన మూవీ ని  ఓటిటిలో ఎప్పుడు విడుదల చేయబోతున్నారనే విషయంపై అందరి కళ్ళు ఉన్నాయ్. మామూలుగా సినిమాలు కేవలం రెండు మూడు వారాల్లోనే ఆన్‌లైన్‌లో స్ట్రీమ్ అవుతున్నాయి.  విడుదలకు ముందే ఓటిటి సంస్థలు నిర్మాతలతో అలా అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. అందుకే క్రాక్, మాస్టర్ లాంటి సినిమాలు థియేటర్స్‌లో ఆడుతున్నపుడే  ఓటిటిలో కి ప్రవేశించాయి.

ఉప్పెన  సినిమా మొదట్లోనే నెట్‌ఫ్లిక్స్ కమింగ్ సూన్ అంటూ ప్రచారం చేసారు. దీనితో నెట్ ఫ్లిక్స్ లో రాబోయే  రెండు వారాల్లోనే స్ట్రీమ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.  కానీ మరోప్రచారం ఏంటంటే  ఈ సినిమాకు 40 రోజుల టైమ్ గ్యాప్ పెట్టుకున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. ఇతర  సినిమాల మాదిరి కాకుండా కాస్త ఆలస్యంగా ఉప్పెన ఓటిటిలో స్ట్రీమ్ మనున్నదని స్పష్టమవుతుంది.

ప్రస్తుత  సమాచారం ప్రకారం మార్చ్ 26 తర్వాత ఉప్పెన సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రానుందని తెలుస్తుంది. 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button