హీరోయిన్ కి 10.. హీరోకి 50…ఇదేం సరిపోతుందంటున్న అభిమానులు…!

uppena hero heroine remuneration : ఉప్పెన సినిమా ఇప్పుడు ప్రతి ఒక్కరి నోటిలో నానుతున్న మూవీ, హీరో మొదటి సినిమాతోనే ఇంతటి విజయంతో పాటుగా భారీ వసూళ్లను రాబట్టి సినిలోకాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. కొత్త డైరెక్టర్, కొత్త హీరో, కొత్త హీరోయిన్ ఈ కాంబినేషన్ లో విజయం సాదించి, వసూళ్లను రాబట్టడం లక్ అనే చెప్పాలి.
బహుశా ఇదే మొదటిదై ఉంటుంది కూడా… తొలి సినిమా హీరోకి ఈ స్థాయిలో వసూళ్లు రావడం నిజంగా చిత్రసీమని విస్మయానికి గురిచేస్తుంది.

ఇంతటి విజయానికి కారణం కథతో పాటు, మెగా హీరో కావడం, అలాగే హీరోయిన్ అందం అని చెప్పవచ్చు. వీరు ముగ్గురు ఇండస్ట్రీ కి కొత్తగా పరిచయమై పాపులారిటీని తెచ్చుకున్నారు. రూపాయికి రెండు రూపాయి లాభం తీసుకొచ్చిన సినిమాల జాబితాలోనూ కూడా ‘ఉప్పెన ‘ చేరిపోతుంది.
కానీ ఈ హీరో, హీరోయిన్ ల పారితోషికాలే చాల చీప్ గా ఉన్నాయని , అవి హీరోకి 50 లక్షలు, హీరోయిన్ కి కేవలం 6 లక్షలు మాత్రమే ముట్టజెప్పారని ప్రచారం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మైత్రీ బృందం రంగంలోకి వచ్చి, హీరో, హీరోయిన్ల కు తక్కువ అమౌంట్ ఇచ్చారనే అపవాదు తమపై రాకుండా… వాళ్లిద్దరికీ సర్ప్రైజ్ క్యాష్ గిఫ్టులు ఇచ్చి సంతృప్తి పరిచారు.

ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్‌కి 50 లక్షలు, కృతికి 10 లక్షలు ఇచ్చారని సమాచారం . ఇక మొత్తంగా వైష్ణవ్‌కి కోటి రూపాయలు , కృతికి 16 లక్షలే ముట్టిందన్న మాట. ఈ విషయంపై ఇదేం సరిపోతుంది అంటున్నారు అభిమానులు.