Tollywood news in telugu

uppena director buchi babu properties : ఉప్పెన దర్శకుడి ఆస్తులు ఎంతో తెలుసా…కూర్చొని తిన్న కరగవట …!

uppena director buchi babu properties

uppena director buchi babu properties : తొలి చిత్రంతోనే  దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు గతంలో డైరెక్టర్ సుకుమార్ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసారు. ఇపుడు సుకుమార్ దగ్గర ఓనమాలు నేర్చుకొని , గురువు బాటలోనే నడుస్తున్నాడు. ఇతను మొన్న విడుదలైన  ‘ఉప్పెన’ చిత్రం తో సుకుమార్ శిస్యుడు అనిపించుకున్నాడు.

బుచ్చిబాబు మెగా ఫ్యామిలీ కి చెందిన  వైష్ణవ్ తేజ్ తో సినిమా తీసి విజయాన్ని తన కతాలో వేసుకున్నాడు. ఇందులో హీరోఇన్ గా  కృతిశెట్టి  నటించి , మొదటి సినిమాతోనే ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఇలా వీరిద్దరు కొత్తవాళ్లు అయినప్పటికీ బుచ్చిబాబు ఒక ప్రయోగం చేసి అందులో సక్సెస్ అయ్యాడు.

 మన పక్కింటి అబ్బాయిల ఉండే బుచ్చిబాబు ఇంతటి రిస్క్ తీసుకొని చేయడాన్ని పలువురు ఆశ్చర్యానికి గురిఅయ్యారు.   అసలు కొత్త దర్శకుడు అనే ఫీల్ సినిమాలో ఎక్కడ కూడా కనపడనివ్వకుండా ఒక  అనుభవం ఉన్న దర్శకుడిలా భలే చేశాడంటూ బుచ్చిబాబు ను సినీ పెద్దలు ప్రశంశిస్తున్నారు.

ఇక బుచ్చిబాబు తన పర్సనల్ విషయాలు మాట్లాడుతూ… ‘నేను ఇండస్ట్రీలోకి వచ్చి ఏదో సాధించేయాలని అని అనుకోలేదు. ఎందుకంటే మా ఊర్లో నేను బ్రతికేయడానికి కావలసిన ఆస్తులు ఉన్నాయి. కానీ మనిషికి ఎదో ఒక ఫ్యాషన్ ఉండాలని  హైదరాబాద్ కి వచ్చి ఇలా ఇపుడు మీ ముందు నిలుచున్నా అని తెలిపాడు. 

మా అమ్మ, నేను   హైదరాబాద్ వచ్చేటపుడు  ఒకటే చెప్పింది.   బుచ్చిబాబూ నువ్ డైరెక్టర్ అయ్యావనే మాట నా చెవిన పడెయ్ రా…అని అంది. ఇపుడు మా అమ్మ అన్నది నేను సాధించడంతో … ఇపుడు మా అమ్మ ఇంటికి వచ్చేయ్ … డైరెక్టర్ వి అయ్యావ్ కదా ఇక చాలు రా..రా.. అంటుంది. అని బుచ్చిబాబు తన విషయాలను పంచుకున్నాడు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button