Uppena Collection: చరిత్ర తిరగరాస్తున్న వైష్ణవ్ తేజ్.. ఫస్ట్ సినిమాకే యువ హీరోలను వెనకు నెట్టి…దూసుకుపోయాడు ..!

Uppena Collection : తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికి చాల మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారు , ఇప్పుడు వాళ్లలో చాలా వరకు స్టార్లుగా ఎదిగారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలుగు ఇంస్ట్రీకి మరో యువ హీరో మెగా ఫ్యామిలీ నుండి వచ్చి ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్టీని షేక్ చేసాడు. అతడే….పంజా వైష్ణవ్ తేజ్. ఇండస్ట్రీలో పేరున్న ఫ్యామిలీ నుంచి రావడంతో తేజ్ ఫై బారి అంచనాలు ఉన్నాయి . ఇపుడు ఆ అంచనాలకు తగ్గట్టే వైష్ణవ్ తేజ్ పేరు మారుమోగిపోతుంది.

తేజ్ మొదటి సినిమా ‘ఉప్పెన’ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా విడుదల అయింది . స్వచ్ఛమైన లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ల పరంగా, ఇంతకుముందే మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలతోనే కాకుండా మిగిలి యువహీరోలు వెనక్కు నెట్టే కలెక్షాన్ ల వర్షం కురిసింది.
సీనియర్ దర్శకుడు సుకుమార్ దగ్గర ఓనమాలు నేర్చుకున శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన సినిమానే ‘ఉప్పెన’. అతిపెద్ద ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన సినిమాలో కృతీ శెట్టి హీరోయిన్గా నటించింది.

ఇక ఈ సినిమాలో నెగెటివ్ పాత్రలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించాడు. ఈ సినిమాలో విజయ్ కూడా ఒక ఆకర్షణ అని చెప్పవచ్చు. ఇతను తమిళ్ డబ్ద్ మూవీ ‘మాస్టర్ ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈ సినిమాకు యాంగ్ డైనమిక్ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ బాణీలను అందించారు.
‘ఉప్పెన’ సినిమాకు ‘నీ కన్ను నీలి సముద్రం’ పాటతో ఒక్కసారిగా హైప్ ని తెచ్చిపెట్టింది. ఈ పాటకోసమే సినిమా చూసినవాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కేవలం పాటకోసమే సినిమా విడుదలైన తియేటర్లు నిండిపోయాయి. ఈ విదంగా మొదటి రోజు విడుదలైన ప్రతి చోట ఈ సినిమాకు మంచి టాక్ ని తెచ్చుకుంది. హీరోహీరోయిన్ల కు మొదటి సినిమానే అయినా ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించి యువతను ఉర్రుతలూగించగా , ఇక విజయ్ సేతుపతి, సినిమాకు హైలైట్ గా నిలిచాడు. ఇక ఈ సినిమాలో ఎవరు ఊహించని విదంగా క్లైమాక్స్ ఉండడంతో అందరు ఆ క్లైమాక్స్ గురించి చర్చించుకుంటున్నారు.

ఇక హీరో మెగా ఫ్యామిలీకి చెందినవాడు కావడంతో ‘ఉప్పెన’ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ చాలాబాగా జరిగింది. అలాగే సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. ఇందులో ఆంధ్రా ప్రాంత హక్కులు రూ 10 కోట్లు కు సొంతం చేసుకోగా, నైజాం హక్కులు రూ. 6 కోట్లు, సీడెడ్ రైట్స్ రూ. 3 కోట్లు వరకు అమ్ముడయ్యాయి. ఓవర్సీస్తో కలుపుకుంటే మొత్తంగా రూ. 20.50 కోట్ల వ్యాపారం జరిగింది.