Tollywood news in telugu

‘ఉప్పెన’ లా వచ్చి చేరుతున్న కలెక్షన్లు మూడు రోజుల్లోనే రికార్డ్ స్థాయిలో…!

uppena 3rd day collections

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన  ‘ఉప్పెన’ సినిమా  కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.  ఒక కొత్త హీరోకి ఈ స్థాయి వసూళ్లు రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.  అందుకే, టాలీవుడ్ లో అత్యధిక షేర్ వసూలు చేసిన హీరోగా వైష్ణవ్ తేజ్ రికార్డ్ సృష్టించారు. అదేవిదంగా ఈ రకమైన కలెక్షన్లతో స్టార్ హీరోల పక్కన నిలబడే స్థాయికి ఎదిగాడు. ఇక ఈ సినిమా  తొలిరోజే రూ. 10.42 కోట్ల షేర్ రాబట్టిన ‘ఉప్పెన’ను సృష్టించింది.

ఇక ఈ మూవీ  మూడు రోజుల్లోనే  ప్రపంచ వ్యాప్తంగా రూ.28.29 కోట్ల షేర్ వసూలు చేసి ,  బ్రేక్ ఈవెన్ పాయింట్‌ రూ. 22.5 కోట్లును దాటేసి లాభాలు  అందుకుంది. అదేవిదంగా  కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 24.97 కోట్లు రాబట్టింది.  ఈ కలెక్షన్లు బట్టి చూస్తుంటే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుకుమార్ అన్న మాట నిజమయ్యేట్టే కనిపిస్తోంది. ఇది రూ.100 కోట్ల సినిమా అని సుకుమార్ అన్నారు. రూ.100 కాకపోతే కనీసం రూ.90 కోట్లు అయినా వసూలు కచ్చితంగా చేస్తుందని అన్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు అత్యధిక షేర్ రాబట్టిన సినిమాల్లో ఈ సినిమాకూడా చోటు సంపాదించుకుంది. దీని ద్వారా తెలుగు లో అగ్ర హీరోలైన  రామ్ చరణ్, ఎన్టీఆర్ , చిరంజీవి, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ల సరసన వైష్ణవ్ తేజ్ కూడా చేరారు. ఇక  మూడో రోజు ‘ఉప్పెన’ తెలుగు రాష్ట్రాల్లో రూ. 8.26 కోట్లు సంపాదించింది. 

మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ‘ఉప్పెన’ షేర్లు…

ఓవర్సీస్ – రూ. 1.2 కోట్లు

కర్ణాటక – రూ. 1.31 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ. 33 లక్షలు

ఏపీ, తెలంగాణ మొత్తం: రూ. 24.97 కోట్లు

నైజాం – రూ. 8.53 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 4.12 కోట్లు

సీడెడ్ – రూ. 3.7 కోట్లు

తూర్పు గోదావరి – రూ. 2.36 కోట్లు

పశ్చిమ గోదావరి – రూ. 1.53 కోట్లు

కృష్ణా – రూ. 1.76 కోట్లు

గుంటూరు – రూ. 2.07 కోట్లు

నెల్లూరు – రూ. 86.4 లక్షలు

మొత్తం: రూ. 28.29 కోట్లు

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button