Tollywood news in telugu

Upcoming November 2021 Telugu Big Releases : నవంబర్ నెలలో విడుదల అవ్వబోతున్నా భారీ చిత్రాలు :-

Upcoming November 2021 Telugu Big Releases

నవంబర్ నెల రానే వచ్చేసింది. ఈ నెలలో ఎన్నో పెద్ద సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి. ప్రేక్షకులని డబల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేసారు.

మ్యాటర్ లోకి వెళ్తే నవంబర్ లో ముందుగా దీపావళి కానుకగా వచ్చేది రజినీకాంత్ గారి పెద్దన్న , విశాల్ ఆర్య ల ఎనిమి మరియు మారుతీ గారి మంచిరోజులొచ్చాయి. 3 విభిన్న చిత్రాలు మాస్ ఆడియన్స్ కి , క్లాస్ ఆడియన్స్ కి మరియు ఫ్యామిలీ ఆడియన్స్ కి పండగ వాతావరం సృష్టిస్తాయి అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు.

ఇదిలా ఉండగా నవంబర్ 12 న విజయ్ దేవరకొండ నిర్మాణం లో ఆనంద్ దేవరకొండ నటించిన సినిమా పుష్పక విమానం , నాగ శౌర్య ఆర్చరీ బ్యాక్ డ్రాప్ సినిమా లక్ష్య మరియు అశోక్ గళ్ళ మొదటి సినిమా హీరో. ఈ మూడు సినిమాలు కూడా విభిన్న కథలతో రాబోతున్నాయి వీటితోపాటు కిచ్చ సుదీప్ కి కోటికొక్కడు. దీని తర్వాత కార్తికేయ విక్రమార్క సినిమా కూడా నవంబర్ 12 న విడుదలకు సిద్ధం చేశారు.

నవంబర్ 19 న దిల్ రాజు గారి నిర్మాణం లో వచ్చే రౌడీ బాయ్స్ , మరియు నవంబర్ 29 న రాజ్ తరుణ్ అనుభవించు రాజా సినిమాలు విడుదల కాబోతున్నాయి.

ఇవి కాకుండా ఇంకా విడుదల తేదీ ప్రకటించాల్సిన సినిమాలలో కీర్తి సురేష్ గుడ్ లక్ శశి , విరాట పర్వం , బొమ్మ బ్లాక్ బస్టర్ , దృశ్యం 2.

మొత్తానికి నవంబర్ నెలలో దాదాపు 20 కి పైగా పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటితోపాటు చిన్న సినిమాలు కూడా లైన్ కడుతున్నాయి. అన్ని సినిమాలు భారీ లెవెల్ లో హిట్ అవ్వాలని కోరుకుందాం.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button