Today Telugu News Updates
UP Building Collapse: యూపీలో ఘోర ప్రమాదం…కుప్పకూలిన బిల్డింగ్.. 18 మంది మృతి..

UP Building Collapse: యూపీలో ఘోర ప్రమాదం…కుప్పకూలిన బిల్డింగ్.. 18 మంది మృతి :- ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ రాజధానిలోని మురాద్‌నగర్‌లో వర్షం కారణంగా శ్మశానవాటిక ఘాట్ కాంప్లెక్స్‌లోని గ్యాలరీ పైకప్పు కూలిపోవడంతో..
18 మంది మృతి చెందగా..24 మంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెంటనే అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా విషాదకరంగా మారింది. ఇంకా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.