Today Telugu News Updates
కేదారినాథ్ మంచుకొండల్లో చిక్కుకున్న యుపి, ఉత్తరాఖండ్ సీఎం లు !

ప్రముఖ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కేదారినాథ్ లో అనుకోకుండా వాతావరణం మారిపోయి మంచుకురవడం మొదలైంది. క్షేత్రం సమీపంలో పలు అతిధి గృహాల శంకుస్థాపన కు వెళ్లిన యుపి, ఉత్తరాఖండ్ సీఎం లు వాతావరణం అనుకూలించకపోవడంతో అక్కడే చిక్కిపోయారు.
ఈ శంకుస్థాపనకి ఆదివారం వెళ్లిన సీఎం లు తిరుగు ప్రయాణ చేసే సమయంలో హెలికాఫ్టర్ లో వెళ్లే పరిస్థితి లేకపోవరంతో ప్రస్తుతం అక్కడే ఉండిపోయారు.
కేదారినాథ్ ను 2018 లో దర్శించిన యోగి ఆదిత్యనాథ్ అప్పట్లోనే అతిధి గృహాలు కట్టిస్తానని మాట ఇవ్వడంతో ఆ మాటని నెరవేర్చడానికి ఆదివారంరోజు బయలుదేరి శంకుస్థాపనను పూర్తిచేసాడు.
వాతావరణం అనుకూలించాకే మా ప్రయాణం మొదలుపెడతామని యోగి ఆదిత్యనాథ్ ఫోన్ ద్వారా మీడియాకు సమాచారం అందించాడు.