ఫోటోలని నగ్న చిత్రాలుగా మార్చి బెదిరింపులు .

ఫేస్బుక్ , ఇంస్టాగ్రామ్ ఫోటోలని సేకరించి వాటిని మార్పిడి చేసి బెదిరింపులకు పాల్పడుతన్న వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు , అతన్నిఅరెస్ట్ చేసిన సమయంలో 2 మొబైల్ లు స్వాధీనం చేసుకోగా మరో 50 మంది యువతుల సమాచారం అందులో ఉందని పోలీసులు వెల్లడించారు .
వివరాల్లోకి వెళితే మహ్మద్ అహ్మద్ అనే వ్యక్తి కర్నూలుకి చెందిన వ్యక్తి , ఇతను ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి , ఆన్లైన్ అకౌంట్లో ఖాతాలు ఉన్న అమ్మాయిల సమాచారం గుర్తించి వారి వివరాలతో పాటు ఫోటోలు సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి తిరిగి వాళ్ళకి పంపించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూళ్లు చేసే వాళ్ళని పోలీసులు తేల్చారు , కొందరు బయపడి డబ్బులు ఇవ్వగా మరికొందరు పోలీసులకి సమాచారం ఇచ్చారు , పోలీసులు వారిని పట్టుకొని అరెస్ట్ చేశారు.
అయితే అమ్మాయిలు ఆన్లైన్ ఖాతాల్లో తమ వ్యక్తి గత సమాచారం మరియు ఫోటోలు గోప్యంగా ఉంచాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు .