Tollywood news in telugu

Ulalla ullala (2020) telugu movie review & rating


రివ్యూ: ఉల్లాల ఉల్లాల
నటీనటులు : రాజ్ తరుణ్, షాలినీ పాండే, నాజర్, రోహిణి తదితరులు
దర్శకత్వం : సత్య ప్రకాశ్
నిర్మాత : ఏ గురురాజ్
బ్యానర్ : సుఖీభవ మూవీస్
మ్యూజిక్ : జాయ్ రాయరాల
సినిమాటోగ్రఫి : జే.జీ. కృష్ణ, దీపక్
ఎడిటింగ్ : ఉద్దవ్

నటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించిన సత్య ప్రకాశ్ దర్శకుడిగా మారి ఊల్లాల ఊల్లాల చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆయన తన కుమారుడు నటరాజ్‌ను తెలుగు తెరకు పరిచయం చేస్తూ.. తీసిన ఈ చిత్రం దర్శకుడిగా సత్య ప్రకాశ్‌కు, హీరోగా నటరాజ్‌కు ఏవిధంగా ఉపయోగపడింది? ఊల్లాల ఊల్లాల చిత్రం వీరిద్దరికి ఎలాంటి ఫలితాన్ని మిగిల్చింది? అనేది రివ్యూలో చూద్దాం.

కథ:
మూవీ దర్శకుడిగా మారాలనే కోరిక, డబ్బుపై వ్యామోహం ఉన్న నటరాజ్ (నటరాజ్)‌ను నూరిన్ (నూరీన్ షెరీఫ్) ప్రేమిస్తూ ఉంటుంది. అయితే అతను మాత్రం ఆమెను పట్టించుకోకుండా ఉన్నట్లే ఉంటాడు. మంచి దర్శకుడిగా పేరు తెచ్చేందుకు తపన పడుతూ ఉండే నటరాజ్ జీవితంలోకి త్రిష (అంకితా మహారాణా), అతిలోక సుందరి (కాలకేయ ప్రభాకర్) నూరిన్ ఇంట్లో ఉంటాడు. నటరాజ్‌కు పండు అనే పాత్రలో తనను తాను ఊహించుకుంటాడు? త్రిష, పండు అనే పాత్రకు ఉన్న సంబంధం ఏమిటి? వీరంతా ఎందుకు మాయమతుంటారు? అసలు వారంతా మనుషుల్లా ఉండే ఆత్మలా.. ఆత్మ రూపంలో ఉన్న మనుషులా? తెలుసుకోవాలంటే ఉల్లాల ఉల్లాల చిత్రం చూడాల్సిందే.

విశ్లేషణ:

విలన్ గా సత్య ప్రకాశ్ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు, తన కుమారుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడంటే అందరికీ ఓ మోస్తరు అంచనాలుంటాయి. యాక్షన్ పరంగా సత్య ప్రకాశ్ రేంజ్‌లో ఉంటుందని అందరూ భావించడం సహజం. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో నటరాజ్ సక్సెస్ అయ్యాడు. ఫైట్స్, డాన్స్ లో తన ప్రతిభ కనబర్చాడు. ఇక నూరీన్ కనిపించింది కొద్దిసేపే అయినా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది, నటనతో ఆకట్టుకుంది. త్రిష పాత్రలో నటించిన అంకితా తన గ్లామర్ తో ఆకట్టుకుంది. అతిలోక సుందరిగా కనిపించిన కాలకేయ ప్రభాకర్ తన మేకప్‌తో ప్రేక్షకులకు కొత్త లుక్ లో కనిపించాడు. మిగతా పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించారు.

దర్శకుడిగా మొదటి అడుగులో సక్సెస్ అయ్యాడు సత్య ప్రకాష్. ప్రతి ఒక్కరి పాత్ర నుంచి ఎమోషన్‌ను రాబట్టుకున్నాడు. ఊల్లాల ఊల్లాల చిత్రంలోని పాత్రలతో ప్రేక్షకులను కనెక్ట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

చిత్రానికి సంగీతం, సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం, ఎడిటింగ్ ఇలా అన్ని చక్కగా కుదిరాయి. సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు మరింత బలం చేకూర్చాయి. తెరపై సినిమాను అందంగా చూపించడంలో సినిమాటోగ్రఫీ విభాగం సఫలం అయ్యింది. ఎడిటింగ్ విభాగం ఈ చిత్రాన్ని ఎక్కడా బోర్ కొట్టకుండా కాపాడింది. నిర్మాణ విలువలు సినిమా మరో స్థాయికి తీసుకొనివెళ్లాయి.

నూరిన్‌ను రౌడీలు ఏడ్పించడం, నటరాజ్ వచ్చి కాపాడటం లాంటి సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. త్రిష పాత్ర ఎంటరైన తరువాత రొమాంటిక్ సీన్లతో తెరను హీటెక్కిస్తుంది. ముద్దు సీన్లతో ఇద్దరూ రెచ్చిపోతూ ఉంటారు. యూత్ కు ఈ ఎలిమెంట్స్ బాగా కనెక్ట్ అవుతాయి.

చివరిగా: ఉల్లాల ఉల్లాల అంటూ ప్రేక్షకులను అలరిస్తుంది.

రేటింగ్: 3.5/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button