యు టర్న్ మూవీ రివ్యూ
నటీనటులు : సమంత, భూమిక, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, నరేన్
సంగీతం : పూర్ణచంద్ర
సినిమాటోగ్రఫర్ : నికెత్ బొమ్మి రెడ్డి
ఎడిటర్ : సురేష్ ఆరుముగమ్
దర్శకత్వం : పవన్ కుమార్
నిర్మాతలు : శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బండారు
అక్కినేనివారి కోడలు టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతా ముఖ్య పాత్రలో నటించిన కన్నడ మూవీ రీమేక్ గా తెలుగులో తెరకెక్కిన చిత్రం ‘u turn “. ఈ చిత్రం వినాయకచవితి రోజు సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ కుమార్ దర్శకత్వం వహించినఈ మూవీలో ఆది, భూమిక,రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలో నటించారు. మొదటి సారి సమంతా నిర్మాతగా మారి తీసిన ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రం ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ:
రచన అనే అమ్మాయి (సమంత) టైమ్స్ ఆఫ్ ఇండియాలో జర్నలిస్ట్ గా వర్క్ చేస్తుంటుంది. ఆర్కేపురం ఫ్లై ఓవర్ పై జరిగే యాక్సిడెంట్లకు సంబంధించిన అసలు డీటెయిల్స్ ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటుంది. ఆ ఫ్లైఓవర్ పై షాట్ కట్ రూట్ లో వెళ్ళడం కోసం u turn తీసుకున్న వ్యక్తులు మాత్రమే చనిపోతుంటారు. అసలు అలా ఎందుకు జరుగుతుంది , వారు మాత్రమే ఎందుకు చనిపోతున్నారు అనే విషయంపై ఆమె ఇన్వెస్టిగేషన్ చేస్తుంటుంది. ఆ టైంలోనే ఆమె ఒక హత్య కేసులో ఇరుక్కుంటుంది. పోలీసులు రచనని ఇంటారాగేట్ చేస్తే ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నాయక్ (ఆది)కి రచనకి ఆ హత్య కేసుకి ఎలాంటి సంభందం లేదని తెలుసుకుంటాడు. మరి ఆ చావుల వెనుక అసలు మిస్టరీ ఏంటి? అవి సహజ మరణాలా? లేక హత్యలా? ఆ ఫ్లైఓవర్ పై యూటర్న్ తీసుకునే వారే ఎందుకు చనిపోతున్నారు? ఫైనల్ గా ఈ యూ టర్న్ మిస్టరీకి సొల్యూషన్ ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
విశ్లేషణ :
ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన యు టర్న్ మూవీ అంతా ఒక ఫ్లైఓవర్ పై u turn దగ్గర జరిగే చావుల నేపథ్యం చుట్టూ నడుస్తుంది. ఈ మూవీ ద్వారా ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేసాడు దర్శకుడు పవన్ కుమార్. ఒరిజినల్ వర్షన్‌కు దర్శకత్వం వహించిన పవన్ కుమార్ తెలుగు వర్షన్ ను కూడా డైరెక్ట్ చేశారు. తొలి పది నిమిషాలు కాస్త నెమ్మదిగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో మైంటైన్ చేసిన సస్పెన్స్ బాగుంది. అలాగే ఆమెకు, ఆమె తల్లికి మధ్యన నడిచే కామెడీ ట్రాక్ కూడ బాగుంది. సెకండ్ హాఫ్ లో ద్వితీయార్థంలో సరైన స్టొరీ లైన్ లేకపోవడం, సినిమా మొత్తం ఒకే పాయింట్ మీద సాగడంతో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడని చెప్పాలి . కొన్ని సన్నివేశాలు మరీ సాగదీసినట్టు అనిపిస్తాయి.
నటీనటులు
టాప్ హీరోయిన్ గా గ్లామర్ పాత్రల్లో మంచి పేరు తెచ్చుకున్న సమంత మొదటి సారి ఒక లేడీ ఓరియెంటెడ్ క్యారెక్టర్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసింది. తన పర్ఫామెన్స్ సినిమాకి హైలైట్ అనే చెప్పాలి. డబ్బింగ్ కూడా తానే స్వయంగా చెప్పుకుంది. పవర్ఫుల్ పోలీస్ పాత్రలో ఆది పినిశెట్టి సరిగ్గా సరిపోయాడు. ఉన్నంతలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. భూమిక ఉన్నది కొద్ది సేపే అయినా మంచి ఎమోషన్స్ పండించారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో భూమిక నటన కంటతడిపెట్టిస్తుంది. సమంత ఫ్రెండ్ పాత్రలో క్రైమ్ రిపోర్టర్ గా రాహుల్ రవీంద్రన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇతర పాత్రలో నరేన్, రవి ప్రకాష్‌లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక విభాగం :
దర్శకుడు పవన్ కుమార్ ఒక మంచి కాన్సెప్ట్ ని ఎంచుకున్నాడు. అయితే సెకండ్ హాఫ్ నార్మల్ గా ఉంది. నికెత్ బొమ్మి రెడ్డి తీసిన విజువల్స్ చాలా బాగున్నాయి. పూర్ణ చంద్ర అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా మిస్టరీకి సంబంధించిన సన్నివేశాల్లో ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సురేష్ ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తోంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
పాజిటివ్ పాయింట్స్ :
థ్రిల్ కలిగించే కథాంశం
సమంత పెర్ఫార్మెన్స్
ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు
నేపథ్య సంగీతం
నెగెటివ్ పాయింట్స్ :
తొలి పది నిమిషాలు
అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు లోపించడం
ద్వితీయార్థంలో కథనం లోపించడం
సాగదీయబడిన సన్నివేశాలు
తీర్పు :
ఈ చిత్రం రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సస్పెన్స్ పంధాలో సాగుతుంది. సినిమాలో వచ్చే ఊహించని సన్నివేశాలు, మిస్టరీకి సంబంధించిన సస్పెన్స్ ఎలిమెంట్స్ బాగున్నాయి. మొత్తం మీద భిన్నమైన, కొత్త తరహా సస్పెన్స థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. కానీ మిగిలిన వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.