News

గాలి కొడుతుండగా… అనుకోని ఘటన … అంతలోనే ఏంజరిగిందంటే…!

కేవలం ఒక టాక్టర్ టైర్ రెండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ సంఘటన  శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండంలోని కొమనాపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. అక్కడ ఉన్న కొందరి  స్థానికుల వివరాల ప్రకారం.. దాసరి సూర్యనారాయణ  గత 30 సంవత్సరాలుగా కొమనాపల్లి కూడలి వద్ద పాన్‌షాప్ నిర్వహిస్తున్నాడు. అలాగే, సైకిల్ రిపేరింగ్, వాహనాలకు గాలి కొట్టడం వంటివి పనులు కూడా చేస్తూ ఉంటాడు.

నిన్న రాత్రి దాసరి దుకాణం మూసివేస్తున్న సమయంలో,  తిమడాం గ్రామానికి చెందిన బొమ్మాళి గోవింద  ట్రాక్టర్ టైరు తీసుకొచ్చి పంక్చర్ చేసివ్వమని కోరాడు.  ఆ పంక్చర్ పూర్తిచేసి దాసరి  సూర్యనారాయణ గాలి కొడుతుండగా ట్యూబ్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది.

అక్కడే ఉన్న దాసరి, గోవింద్ లు ఇద్దరూ ఆ బారి శబ్దానికి  సూర్యనారాయణ అక్కడికక్కడే చనిపోగా.. తీవ్రంగా గాయపడిన గోవిందను శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలిస్తుండగా నే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఈ ఘటనతో ఆ ఊరిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button