Two Climaxes For Love Story : రెండు క్లైమాక్స్ లు సిద్ధం చేసిన శేఖర్ కమ్ముల :-

Two Climaxes For Love Story : శేఖర్ కమ్ముల గారు న్యాచురాలిటీ కి పెట్టింది పేరు. తీసే ప్రతి సినిమా ఫీల్ గుడ్ లా , ఆలా ప్రేక్షకుల గుండెలో నిలిచిపోతుంది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం శేఖర్ కమ్ముల గారు నాగ చైతన్య , సాయి పల్లవి తో కలిసి లవ్ స్టోరీ సినిమా తీసిన విషయం తెలిసిందే. ఈ సినిమా రేపే విడుదల అవ్వబోతుంది.
అయితే ఇటీవలే జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో శేఖర్ కమ్ముల గారు ఈ విధంగా చెప్పారు ‘ ఈ సినిమాలో హ్యాపీ ఎండింగ్ వెర్షన్ ఉంది మరియు బాధ తో కూడిన ఎండింగ్ ఉంది , రెండు వెర్షన్ లు షూట్ చేశాము. ” అని చెప్పారు.
అయితే సెన్సార్ బోర్డు ఏ వెర్షన్ ని అప్ప్రోవ్ చేసిందో తెలియదు. ప్రేక్షకులకి రేపు ఏ వెర్షన్ థియేటర్ లో అలరించబోతుందో వేచి చూడాలి. ఒకవేళ బాధకరమైన ఎండింగ్ ఉంటె ప్రేక్షకులు ఆధారించలేరు.
ఎందుకంటే గతం లో ప్రియా వారియర్ లవర్స్ డే సినిమా కూడా మొదట్లో బాధతో కూడిన ఎండింగ్ తో రిలీజ్ చేసి ప్రజలు ఆదరించకపోయేసరికి మరల హ్యాపీ ఎండింగ్ తో విడుదల చేస్తే అపుడు ఓమాదిరి ఆడింది ఆ సినిమా.
అయితే సడన్ గా శేఖర్ కమ్ముల గారు కూడా రెండు ఎండింగ్ వెర్షన్ చేసాము అనేసరికి ఎక్కడ తారుమారవుతుందో అని అభిమానులు భయపడుతున్నారు. చూడాలి మరి లవ్ స్టోరీ ఏ రేంజ్ లో అలరించబోతుందో.