Today Telugu News Updates
Trump: ట్రంప్ ఖాతా బ్యాన్ చేసిన ట్విట్టర్ కి భారీ నష్టం.. ఎంతంటే?

ఇటీవల అమెరికాలోనీ క్యాపిటల్ కార్యాలయంపై ట్రంప్ మద్దతుదారులు దాడి చేయడంతో ట్రంపు వారిని ఉద్దేశించి ట్విట్టర్లో ట్వీట్ లు పెట్టగా… అవి హింసను మరింత ప్రేరేపించేలా ఉన్నాయని ట్విట్టర్ యాజమాన్యం ట్రంప్ ఖాతాని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

ట్రంప్ ఖాతాని సస్పెండ్ చేయడం వల్ల ట్విట్టర్ కి భారీ నష్టం వచ్చింది. సోమవారం స్టాక్ మార్కెట్లో ట్విట్టర్ షేర్ వాల్యూ 12 శాతం పడిపోయింది. అంటే 5 బిలియన్ ల డాలర్లు ట్విటర్ నష్టపోవాల్సి వచ్చింది.
అలాగే ట్విట్టర్లో ఉద్వేగలను రెచ్చగొడుతున్న 70 వేల ట్రంప్ మద్దతుదారుల ఎకౌంట్లను కూడా ట్విట్టర్ బ్యాన్ చేసింది.