Tollywood news in telugu
TV నటి శ్రావణి కేసులో పలు మలుపులు…

నటి శ్రావణి ఆత్మహత్యకు ముందురోజు శ్రావణి–సాయి ల మధ్య జరిగిన గొడవ కేసులో కీలకం కానుంది,ఒక రెస్టారెంట్ ముందు నడి రోడ్ పై వీరి మధ్య జరిగిన వివాదం సీసీ టీవీ లో రికార్డ్ ఆధారంగా చేసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు.
శ్రావణిని ,సాయి రెస్టారెంట్ ముందు నుండి బలవంతగా ఆటోలో తీసుకొని వెళ్లినట్టు సీసీ టీవీ లో రికార్డ్ అయింది . దీనిని బట్టి సాయిని ఎస్ ర్ నగర్ పోలీస్ స్టేషన్ లో విచారించనున్నారు.
శ్రావణి ముందుగా సాయి ని ప్రేమించి ,తరవాత దేవరాజ్ పై మనసు పడింది. అది తట్టుకొని సాయి శ్రావణిని మాటలతో బెదిరించినట్టు సీసీ టీవీ లో ఆధారాలు కనబడుతున్నాయి.
వీరి ఇద్దరి మధ్య మానసిక వేదనకు గురి కావడంతోనే శ్రావణి చనిపోయిందా అన్నకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.