telugu gods devotional information in telugu

ఈరోజు మంగళవారం చవితి ఆరాధన

ఈరోజు చేయాల్సిన ఆరాధన విశేషాలు.

ఈరోజు కార్తీక బహుళ చవితి, కార్తీక మాసంలో పంతొమ్మిదో రోజు, ఇది ఈరోజు మంగళ వారం తో కూడుకుని వచ్చింది.కాబట్టి సుబ్రమణ్య స్వామి వారి ఆరాధనకు అనుకూలమైన రోజు. కార్తీక మంగళవారాల్లో సుబ్రమణ్య ఆరాధన వల్ల కార్తికేయ అనుగ్రహము తో పాటు కుజ, నాగ, సంతాన దోష నివృత్తి కలుగుతుంది.ఈ రోజున నాగ సింధూరం ధరించి చేసే ఆరాధన వల్ల ఋణ విమోచన కలుగుతుంది. ఋణ బాధలు ఉన్నవారు ఈరోజున అంగారక కవచం చదవడం మంచిది.

విద్యా ప్రాప్తికి ప్రజ్ఙ్ఞా వివర్ధన స్తోత్రం చదవాలి.ఏదైన సుబ్రమణ్య ఆలయం సందర్శన చేసి స్వామి వారికి పాలాభిషేకం చేయాలి, పుట్ట ఉన్నట్లయితే సందర్శన చేసి పాలు, నువ్వుల ఉండ వంటివి సమర్పణ చేయాలి. పుట్ట మన్నుని తిలకం గా ధారణ చేయాలి. ఇంటి ద్వారంనకు రక్ష గా కూడా పెట్టవచ్చు.
ఓం శరవణభవాయ నమః

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button