Today Telugu News Updates

మొదలైన సచివాలయం కూల్చివేత, TS secretariat demolition

మొదలైన సచివాలయం కూల్చివేత, TS secretariat demolition
మొదలైన సచివాలయం కూల్చివేత, TS secretariat demolition

 తెలంగాణలో కొత్త సచివాలయం సాగారం కాబోతున్నది . TS secretariat demolition పాలనా భవనంగా అద్భుత కట్టడం ఆవిష్కృతం కానుంది . ఈ క్రమంలో తెలంగాణ పాత సచివాలయం కూల్చివేత పనులు వేగంగా జరుగుతున్నాయి .. అర్ధరాత్రి నుంచి ఆర్ఆండ్ బి ఆధ్వర్యంలో కూల్చివేత పనులు చేపట్టారు . ఇప్పటికే హైకోర్టు నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సిఎం కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధతో కొత్త సచివాలయానికి సంకల్పించారు .

పాత సచివాలయం స్థానంలోనే కొత్త సచివాలయం నిర్మించేందుకు సర్కార్ సిద్ధమైంది . కొత్త డిజైన్‌ను ఇప్పటికే తయారు చేసింది . ఆరు అంతస్తులో కొత్త తెలంగాణ సచివాలయం ఉండబోతోంది . దీనికి సంబంధించిన డిజైన్‌ను మంగళవారం ప్రభుత్వం విడుదల చేసింది . ఏడాదిలోగా కొత్త సచివాలయం నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది . త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ జీఓ పై ఆమోద ముద్ర వేయబోతున్నారు . డిజైను ఆమోధ ముద్ర వేయగానే కొత్త నిర్మాణం పనులు మొదలవుతాయి . ఇందులో భాగంగా పాత భవనాల కూల్చివేతను చేపట్టారు .

TS secretariat demolition ::

 మొదటగా జీ  బ్లాక్ లను కూల్చివేస్తున్నారు . దీని కోసం  సచివాలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికే ఆంక్షలు విధించారు . వాహనదారులను దారిమళ్లించారు . దీంతో తెలంగాణ పాత సచివాలయం కూల్చివేత పనులను ప్రభుత్వం వేగంగా ప్రారంభించింది . సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది . ప్రభుత్వ ఆదేశం మేరకు సోమవారం అర్ధరాత్రి నుంచే కూల్చి వేతకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు . పోలీసులను భారీగా మొహరించి సెక్రటేరియట్ దారులన్ని మూసివేశారు . ఖైరతాబాద్ , ట్యాంక్ బండ్ , మింట్ రాపౌండ్ సెక్రెటరేట్ దారులను పోలీసులు మూసివేశారు .

 ఏడాది క్రితమే సచివాలయం నిర్మాణానికి ప్రభుత్వం   భూమిపూజ చేసింది . 132 ఏళ్ల మన చరిత్ర కలిగిన సచివాలయం … నిజాం నవాబుల పాలనా కేంద్రంగా సైఫాబాద్ ప్యాలెస్ పేరుతో ప్రసిద్ధి చెందింది . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలువురు ముఖ్యమంత్రుల పాలనా కేంద్రంగా ఉంది . తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వారి పాలనా కేంద్రమైంది . మొత్తం 16 మంది ముఖ్యమంత్రుల పాలనా కేంద్రంగా వెలసిల్లిన సచివాలయాన్ని నిజాంలు 25 ఎకరాల విస్తీర్ణంలో 10 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయం కట్టడాన్ని నిర్మించారు . 122 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ సచివాలయాన్ని 10 బ్లాకులుగా నిర్మించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button