News

TS EAMCET 2021 : తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల … ముఖ్య తేదీలు మీకోసం …!

TS EAMCET 2021

TS EAMCET 2021 : ఎట్టకేలకు తెలంగాణలో ఎంసెట్ షెడ్యూల్ ని విడుదల చేసారు.  ఇంజినీరింగ్, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశించడానికి విద్యార్థులకు  జూలై 5 నుండి  9 తేదీ వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్నీ  రాష్ట్ర ఎంసెట్ నిర్వహణ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటె ఇకనుండి  ఎంసెట్ కు ఇంటర్ మొదటి సంవత్సరం  సంబంధించిన 100 శాతం సిలబస్, రెండవ సంవత్సరం చెందిన 70 శాతం సిలబస్ ను ఇస్తున్నట్టు కమిటీ ఇదివరకే తెలిపింది. ఇక  ఆన్ లైన్ ద్వారా ప్రతిరోజూ రెండు దశల్లో ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నారు.

ఎంసెట్  షెడ్యూల్ ఈ విదంగా ఉంది…

ఈ మార్చి 18న నోటిఫికేషన్ రానుంది. అదేవిదంగా మార్చి 20 నుండి మే 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక చివరగా లేట్ ఫీజుతో జూన్ 28 వరకు దరఖాస్తుల ను స్వీకరిస్తారు. ఎగ్జామ్స్ జూలై 5 నుంచి 9 వరకు జరుగనున్నాయి. ఇందులో జూలై 5,6 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల కు సంబంధించి ప్రవేశ పరీక్షలు అలాగే జూలై 7,8,9 తేదీల్లో ఇంజినీరింగ్ కోర్సుకు సంబంధించి  ప్రవేశ పరీక్షలు జరుగుతాయి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button