telugu facts

హాలిడే ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ యాప్స్ ని ట్రై  చేయండి

try this apps to planning vacation::

try this apps to planning vacation

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు బిజీ లైఫ్ని గడుపుతున్నారు. ఇల్లు, ఆఫీస్ ఈ రెండే ప్రపంచం అన్నట్లు ఉంటారు. అయితే ఏ మాత్రం కాస్త విరామం దొరికిన ఆ హాలిడే ని ఎలా ఎంజాయ్ చేసుకోవాలి, ఏ ప్లేసెస్ కి వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, అనే ఆలోచనలతో చాలా మంది తమ టైం ని వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. నేషనల్ ట్రిప్స్ లేదా ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఏవైనా మనం పెట్టే ఖర్చుకి తగ్గట్టు ఎంజాయ్ చేసామా లేదా అనేది ముఖ్యం. మరి ఈ అన్ని విషయాల్లో మనకు సాయం చేసేందుకు, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు రకరకాల యాప్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇప్పుడు కొన్నింటి గురించి చూద్దాం.
కేవలం హాలిడే ట్రిప్స్ మాత్రమే కాకుండా ఫ్లైట్ టికెట్స్, హోటల్ రూమ్స్ ఇలా అన్ని సులభంగా మీ మొబైల్ లో ఈ చెప్పబోయే యాప్స్ ని ప్లే స్టోర్ డౌన్ లోడ్ చేయవచ్చు. ఈ యాప్స్ లో కొన్ని ముఖ్యమైనవి MakeMyTrip, TripAdvisor, AirBnb, Oyo, యాత్రా, క్లియర్ ట్రిప్, ముసాఫిర్, ఎక్స్ పీడియా, ఇక్సిగో, ఐబిబో, స్కైక్రానర్, కాయక్, మొదలైనవి.

ట్రిప్ అడ్వైజర్:

ట్రిప్అడ్వైజర్ మీ చుట్టూ ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు మరియు హాలిడే రెంటల్స్ ని చూపించడానికి మరియు బుకింగ్స్ చేయడానికి మీ ప్రస్తుత లొకేషన్ ని ఉపయోగిస్తుంది. అలాగే మీరు మీ సమీపంలోని ప్రముఖ నగరాలు మరియు ఎయిర్ పోర్ట్స్ ని చూడగలరు. UI నావిగేట్ చెయ్యడానికి సులభం మరియు వివిధ బడ్జెట్ పరిధిలో మీరు ప్రతి రెస్టారెంట్ లేదా హోటల్ ను ఫైండ్ చెయ్యొచ్చు.

దీనిలో మరొక ఆప్షన్ ‘థింగ్స్ టు డు’ ఒకటి. ఈ ఆప్షన్ ద్వారా ఒక కొత్త సిటీలో కావలసిన అన్ని వస్తువులు, విషయాలు మనకు తెలిసేలా చేస్తుంది.

ఈ యాప్ మంచి మంచి ప్లేసెస్ ని సందర్శించడానికి మాల్స్, దేవాలయాలు మరియు ఇతర సైట్ సీయింగ్ లొకేషన్స్ లాంటివి మనకు చూపిస్తుంది. మీరు ఈ యాప్ లో సెట్టింగ్స్ ని మార్చవచ్చు మరియు ‘స్పాస్ అండ్ వెల్ నెస్’, ‘అమ్యూజ్ మెంట్ పార్క్స్’, ‘అవుట్ డోర్ యాక్టివిటీస్’ వంటి కేటగిరీ జాబితా నుండి ఎంచుకోవచ్చు. ట్రిప్ అడ్వైజర్ మ్యాప్ మరియు ఊబర్ అవైలబిలిటీతో లొకేషన్స్ ని చూపుతుంది.

ట్రిప్ అడ్వైజర్ గురించి మరొక మంచి విషయం ఏమిటంటే, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే, మీరు వాటిని ఉపయోగించడానికి ముందుగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. న్యూయార్క్, టోక్యో, పారిస్, రోమ్, ప్రేగ్ వంటి 300 నగరాల నుండి Maps ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

దీనిలో ‘టెలిగ్రామ్’ సర్వీస్ మీ ప్రియమైనవారికి టెలిగ్రామ్ పంపే ఆధునిక మార్గం. మీరు చిత్రాలను క్లిక్ చేసి, తిరిగి వెనక్కి పంపవచ్చు మరియు మీరు ఇమెయిల్ ద్వారా కావాలనుకునే వారికి పంపించవచ్చు. మీరు ట్రిప్ అడ్వైజర్ పై చిత్రాలను కూడా అప్ లోడ్  చేయవచ్చు మరియు మీరు ఉన్న ప్లేసెస్ గురించి రివ్యూస్ వ్రాయవచ్చు. ఇవి ఇతరులకు ఉపయోగపడతాయి. ట్రిప్అడ్వైజర్ లో ఫ్లైట్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

మేక్ మై ట్రిప్:

MakeMyTrip యాప్ హాలిడే ట్రిప్స్ కి ప్లాన్ చేసుకునేవారికి చాలా అనువైనది. ఈ యాప్ అన్ని రకాల హాలిడే ప్యాకేజీలను అందిస్తుంది, అంటే ఇది భారతదేశం మరియు విదేశాల్లో పర్యటించడానికి కూడా యూస్ అవుతుంది.  ఈ యాప్ లో ప్యాకేజీలు ట్రిప్ గురించి పూర్తి విషయాలతో స్పష్టంగా ఉంటాయి. అందుకే ఈ యాప్ చాలా మంది ఇండియన్స్ కి ప్రియమైనది.

యాప్ హోం పేజిలో హోటల్స్, విమానాలు మరియు హాలిడే ప్యాకేజీలపై స్పెషల్ డీల్స్ మరియు డిస్కౌంట్లను డిస్ ప్లే చేస్తుంది. ప్రస్తుతం ఈ యాప్ హోటళ్ళపై 65 శాతం వరకు, భూటాన్ హాలిడే ప్యాకేజీలపై 10,000 రూపాయల చొప్పున డిస్కౌంట్లను కలిగి ఉన్నాయి. మేక్ మై ట్రిప్ తో మీరు రైల్వే మరియు బస్ టిక్కెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు మరియు మీ బుకింగ్ యొక్క PNR స్థితిని ట్రాక్ చేయవచ్చు.

ఈ యాప్ వివిధ ప్యాకేజీలను అందిస్తుంది. సీజన్ల ప్రకారం. ఉదాహరణకి ‘వింటర్ ఎస్కేస్సెస్’ పేరుతో డెస్టినేషన్ ప్యాకేజీలను కలిగి ఉంది, ఇందులో కాశ్మీర్, నార్త్ ఈస్ట్ లేదా రాజస్థాన్ ట్రిప్స్ కూడా ఉన్నాయి. సింగపూర్, దుబాయ్, హాంగ్ కాంగ్ మరియు కౌలాలంపూర్ ట్రిప్స్ తో సహా, ‘ఆకట్టుకునే ఆసియా’ నుండి మరియు బడ్జెట్ల ఆధారంగా ప్యాకేజీలను పొందవచ్చు. మేక్ మై ట్రిప్ కి దాని సొంత మొబైల్ వాలెట్ ఉంది.

ట్రివగో యాప్:
కేవలం హోటల్ బుకింగ్స్ కోసమే అయితే ఈ యాప్ ను పరిశీలించొచ్చు. ఏ ప్రాంతంలో ఏ తరహా రూమ్ కావాలో, ఎప్పుడు చెక్ ఇన్, ఎప్పుడు చెక్ అవుట్ అవ్వాలనుకుంటున్నారో తేదీ వివరాలు ఇస్తే చాలు. అందుబాటులో ఉన్న అన్ని హోటల్స్ చార్జీలను ఫిల్టర్ చేసి తక్కువ ధరలు ఎక్కడున్నదీ యాప్ చెప్తుంది.

ట్రిప్ ప్లానర్:
ట్రిప్ ప్లానర్ అనే యాప్ దేశంలోని పర్యాటక ప్రాంతాల సమాచారాన్ని తెలియజేసేందుకు ఉపయోగపడుతుంది. చాలా ప్రాచుర్యం పొందిన, అంతగా ప్రాచుర్యం లేని వాటి గురించి కూడా సమాచారాన్ని ఇవ్వగలదు.

OYO రూమ్స్:

ట్రావెలింగ్, హాలిడే రెంటల్స్, వెకేషన్ ప్యాకేజీలు, ట్రిప్అడ్వైజర్ హోటల్ బుకింగ్స్ మంచి వసతులతో అతి తక్కువ ఖర్చుతో వసతి కల్పించడం ఒక క్లిష్టమైన పని. ప్రత్యేకంగా మీరు మీ స్నేహితులతో తక్కువ అమౌంట్ తో ట్రావెలింగ్ చేయాల్సివచ్చినపుడు. మీరు విశాలమైన మరియు మంచి సేవలు అందించే రూమ్స్ లో ఉండాలని కోరుకుంటే oyo రూమ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు.

OYO రూమ్స్ 5-స్టార్ హోటల్స్ లాంటి లగ్జరీ వినియోగదారులకు అందించాలేకపోయినప్పటికి, వారు తమ ప్రైసెస్ లో మంచిగా ఉన్న రూమ్స్ ని మనకు అందిస్తారు.

OYO రూమ్స్ దాదాపుగా అన్ని లొకేషన్స్ లో ఉన్నాయి. కేవలం మీ లొకేషన్ ని ఎంటర్ చేస్తే యాప్ 2km లేదా 3km పరిధిలో కనీసం 4-5 గదులను చూపుతుంది. మీరు వ్యక్తుల సంఖ్య, దూరం, బడ్జెట్, సౌకర్యాలు మరియు లేడీస్ స్పెషల్ రూమ్స్ కోసం ఫిల్టర్ చేయవచ్చు. ఈ మహిళల ప్రత్యేకమైన గదులను ప్రధానంగా మహిళా సిబ్బంది మాత్రమే నిర్వహిస్తారు. అయితే OYO మహిళలకు ప్రత్యేకమైన గదులు అందుబాటులో ఉన్న లొకేషన్స్ కొన్ని మాత్రమే కలిగి ఉంటుంది. ఒక OYO రూమ్ రూ .799 అతి తక్కువ ధరకు లభిస్తుంది.

Expedia:

మేక్ మై ట్రిప్ వలె ఈ ఎక్స్పెడియా యాప్ ఉంటుంది, ఇది హాలిడే ప్యాకేజెస్ ని అందించదు. ఇది ప్రాథమికంగా హోటళ్లను మరియు ఇతర అకామిడేషన్ ప్లేసెస్ OYO రూమ్స్ సహా డిస్కౌంట్లను కలిగి ఉంటుంది.

ప్యాక్ పాయింట్ యాప్:

ఈ యాప్ మీ వయసు, లింగం, ఏ ప్రాంతానికి వెళ్లాలనుకుంటున్నారు, ఏ అవసరం కోసం వెళుతున్నారు? తదితర వివరాలు అడుగుతుంది. వివరాలు ఇస్తే చాలు. బ్యాగ్ లో ఏవేవి పెట్టుకోవాలి, ఏమేం చేయాలన్నది ఈ యాప్ చెప్పేస్తుంది. దాంతో అనవసరమైన వాటిని పక్కన పడేసి, అవసరమైన వాటినే వెంట తీసుకెళ్లొచ్చు. ఇందులో అయితే మరింత సమాచారాన్ని పొందొచ్చు.
ఐఆర్ సీటీసీ కనెక్ట్:
ఇది రైల్వే శాఖకు చెందిన యాప్. దేశవ్యాప్తంగా ఒక చోట నుంచి మరో చోటుకు ఏఏ రైళ్లు అందుబాటులో ఉన్నాయి, వాటి టికెట్స్ బుకింగ్, సేవలను సులభంగా పొందొచ్చు.
రైల్ యాత్రి:
రైలు యాత్రి యాప్ ద్వారా రైలు రిజర్వేషన్ వాస్తవ స్థితిని తెలియజేసే పీఎన్ఆర్ స్టాటస్, రైలు ఏ ప్లాట్ ఫామ్ పైకి వస్తుందో చెప్పే సమాచారం, సీట్ల లభ్యత, ఏ సమయానికి రైలు వస్తుంది, ఏ సమయానికి బయల్దేరుతుంది? తదితర సమాచారం తెలుసుకోవచ్చు.
ఆడియో కంపాస్:

ఈ యాప్ అనేది కేంద్ర పర్యాటక శాఖ యాప్. టూరిస్ట్ ప్రదేశాలు, అక్కడ చూడాల్సిన విశేషాల గురించి ఆడియో రూపంలో తెలియజేస్తుంది. ఈ యాప్ లో ఉన్న బెస్ట్ ఫీచర్ ఆఫ్ లైన్ లోనూ పనిచేయడం. కొత్త ప్రదేశాన్ని చూసేందుకు వెళ్లేవారు గైడ్ ను పెట్టుకోవద్దనుకుంటే ఈ యాప్ ఉపయోగకరం. ముఖ్యంగా భారత్ కు విచ్చేసే విదేశీయులు భాషా పరంగా ఇబ్బందుల్లేకుండా స్పష్టమైన, స్వచ్ఛమైన ఇంగ్లిష్ లో ప్రాంతాల సమాచారాన్ని వారు వినొచ్చు.

విట్రావెల్ సోలో:
ఒక్కరే పర్యటించాల్సి వచ్చినప్పుడు తోడు కోసం ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఏదైనా ఓ ప్రాంతానికి వెళుతున్నప్పుడు, అదే పర్యటనలో ఉన్న వారితో కలుపుతుంది.

ట్రావెల్ ఖానా:
రైల్లో ప్రయాణిస్తూ ఏదైనా తినాలనిపించిందా, ట్రావెల్ ఖానా యాప్ ఓపెన్ చేసి మెనూ చూసి ఆర్డర్ చేసి మీ టికెట్ పీఎన్ఆర్ నంబర్, ఏ స్టేషన్ లో అందివ్వాలి అన్న వివరాలు అందిస్తే, సరిగ్గా అదే స్టేషన్ లో ఫుడ్ ప్యాక్ మీ చేతిలో ఉంటుంది.

మ్యాప్స్ డాట్ మి’:
మ్యాప్స్ తో ఎక్కడికైనా సులభంగా వెళ్లేంత టెక్నాలజీ నేడు అందుబాటులోకి వచ్చింది. కాకపోతే చాలా రకాల యాప్స్ కు మొబైల్ డేటా అవసరం. అయితే యాప్ మాత్రం ఆఫ్ లైన్ లోనూ చక్కగా పని చేస్తుంది.

 

 

 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button