Trump Twitter Suspension: డొనాల్డ్ ట్రంప్ కె చెక్ పెట్టిన తెలుగమ్మాయి….ఇందుకోసమేనట !

Trump Twitter Suspension: US లోని క్యాపిటోల్ భవనంలో జరిగిన దాడి పట్ల ట్రంప్ వ్యవహరించిన తీరుకు ట్విట్టర్ కఠిన నిర్ణయం తీసుకున్నవిషయం మనందరికి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ట్విట్టర్ ట్రంప్ ఖాతాపై పూర్తిగా నిలిపివేసింది . ఈ విషయంలో ఒక 45 ఏళ్ల భారత సంతతి మహిళ కీలక పాత్ర వహించింది.
కొన్ని రోజుల నుండి ట్రంప్ ట్వీట్లను గమనించిన ట్విట్టర్ , ఆ ట్వీట్ ల వల్ల ఉద్రిక్త ఘటనలు జరగడం మొదలుకావడంతో ఈ పరిస్థితులు చేయి దాటకముందే ఆయన ఖాతాను ట్విట్టర్ యాజమాన్యం తొలగించింది.
ఈ విషయంపై లీగల్, పాలసీ, ట్రస్ట్ అండ్ సేఫ్టీ ఇష్యూస్‌కు హెడ్‌గా ఉన్న విజయ గద్దె ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. అందులో ” డొనాల్డ్ ట్రంప్ చేసే ట్వీట్లు హింసకు దారి తీసే ప్రమాదం ఉండటం వల్ల తన ఖాతాను నిలిపివేశాం అని తెలిపారు.
అమెరికా లో సెటిలైన ఈ తెలుగు అమ్మాయి విజయ గద్దె న్యూయార్క్ యూనివర్శిటీ లా స్కూల్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ట్విట్టర్ సంస్థలో కార్పోరేట్ లాయర్‌గా ఎదిగి ట్రాంప్ కి చెక్ పెట్టారు.