Political News

ఈ దెబ్బతో TRS పని అయిపోయినట్టేనా..? TRS in GHMC elections

వరద బాధితులకు అందించే రూ .10 వేల సహాయం నుంచి ఆయా స్థానిక తెరాస నేతలు , TRS in GHMC elections కార్యకర్తలు కమిషన్లకు కక్కుర్తి పడ్డంతో ఆ పార్టీకి తీవ్ర తలనొప్పి తెచ్చిపెట్టింది . అసలే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపి స్తున్న వేళ , అకాల భారీ వర్షాలు తెచ్చిపెచ్చిన వరదలతో గ్రేటర్ వాసులు బెంబేలెత్తిపోయారు . వరదలకు ఇళ్లు మునిగిపోయి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది . దీంతో పరి స్థితిని ఏదో రకంగా చక్కదిద్ది తమకు అనుకూలంగా మార్చుకోవాలన్న తెరాస ప్రభుత్వ ఆలోచనలకు ఆ పార్టీ కింది స్థాయి నాయకులే గండికొట్టారు . దీంతో గ్రేటర్ లో తెరాస ప్రతిష్ట మసకబారిందనే విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి .

పది వేల పరిహారం అందించి ఏదో రకంగా గ్రేటర్ ఓటర్లను దారికి తెచ్చుకోవాలన్న వ్యూహంతో తెరాస అధినాయకత్వం ఆలోచిస్తే , బాధితులకు అందిం చే మొత్తంలో కొంత మొత్తం మినహాయించుకుని పంపి ణీ చేయడం తీవ్ర గందరగోళానికి దారితీసింది . కింది స్థాయిలో జరిగిన ఇలాంటి తప్పులు త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తెరాసకు చాలా మైనస్ అవుతుందనే ప్రచా రం జరుగుతోంది . మల్కాజ్ గిరి నియోజకవర్గంలోని మౌలాలీ డివిజన్ లో ముగ్గురు తెరాస కార్యకర్తలు బాధితులకు పంపిణీ చేసే మొత్తంలో కొంత సొమ్ము తీసుకున్నట్లు ఆరోపణలు రావడం , అవి నిర్ధారణ కావడంతో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆ ముగ్గురిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు . TRS in GHMC elections బయటకు వచ్చిన సంఘటనలు కొన్నయితే , బయటపడని సంఘటనలు ఇంకెన్ని ఉన్నాయోనని లో ఇలా ప్రచారం జరుగుతోంది . ఇదే విధంగా కాప్రా సర్కిల్ పరి ధిలోని మల్లాపూర్ లోని అశోక్ నగర్ లో కొందరు తెరాస కార్యకర్తలు వరద బాధితుల నుంచి రూ .5 వేలు కమి షన్ తీసుకోవడం సోషల్ మీడియాలో విస్తత ప్రచారం జరిగింది . దీంతో బాధితులు ఆలస్యంగా మేల్కొని సంబంధిత నాయకులను నిలదీశారు . మున్సిపల్ అధి కారులకు ఫిర్యాదు చేసి ధర్నా లు , నిరసన ప్రదర్శనలు నిర్వహించారు .

మరో వైపు కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీ నాయకులు తెరాస కార్యకర్తల తీరును తీవ్రంగా విమ ర్శించారు . పేద వరద బాధితులకు అందించే సహాయం అవినీతికి పాల్పడ్డంపై ఆరోపణాస్త్రాలు సంధిం చారు . గ్రేటర్ హైదరాబాద్ లో వరద బాధితులను అం చనా వేయడంలో రెవెన్యూ వర్గాలను సైతం తెరాస కార్యకర్తలు , నాయకులు ప్రభావితం చేశారనే ఆరోప ణలు వచ్చాయి . ముం దుగానే ఒప్పం దం చేసుకున్న మేరకు ప్రభుత్వం నుంచి పరిహారం అందగానే తమకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వాలని డిమాండ్ చేసి మరీ తీసుకు న్నట్లు బాధితులు కొన్ని చోట్ల బయటకు వచ్చి చెబుతు న్నారు . అంటే దీని వెనుక కొందరు అనర్హులు కూడా వరద బాధితుల జాబితాలో చేరి ప్రభుత్వ సహాయం అందుకున్నట్లు తెలుస్తోంది . వీరితో పాటు అమాయక పేద వరద బాధితులు కూడా కిందిస్థాయి తెరాస కార్య కర్తల ఒత్తిడి మేరకు అందిన ప్రభుత్వ సహాయంలో ఎంతో కొంత సమర్పించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నా యి . ఈ పరిణామాల న్నీ గ్రేటర్ లో తెరాస పార్టీకి రాను న్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రజావ్యతిరేకతను చవిచూ డాల్సి వస్తుందని చాలా మంది అంచనా వేస్తున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button