Trivikram turned as Producer : నిర్మాతగా మారిన మాటల మాంత్రికుడు :-

Trivikram turned as Producer : హెడ్డింగ్ చదవగానే మీకు మ్యాటర్ అర్ధం అయింటది. మాటల మాంత్రికుడి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నిర్మాణ రంగం లో అడుగుపెట్టారు. నిర్మాత మొదటి సినిమా నవీన్ పోలిశెట్టితో ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది.
అయితే నిర్మాతగా త్రివిక్రమ్ గారు బ్యానేర్ పేరు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ అని పెట్టారు. ఇదిలా ఉండగా నిర్మాణ బాధ్యతలు అంటే ప్రొడక్షన్ హౌస్ అంత దగ్గరుండి నడిపించేది మాత్రం త్రివిక్రమ్ గారి సతీమణి అయినా సౌజన్య.
అంటే త్రివిక్రమ్ అటు దర్శకత్వం చేస్తూ ఇటు నిర్మాతగా ఎక్కువ బాధ్యతలు అవడం తో నిర్మాణరంగం అంత సౌజన్య గారిని చూసుకోమని, పోస్టర్ల మీద కూడా అధికారికంగా నిర్మాత సౌజన్య గారి పేరు వేయడం విశేషం.
వరుసగా 3 సినిమాలతో హిట్ దశలలో ఉన్న నవీన్ పోలిశెట్టితో త్రివిక్రమ్ ప్రొడక్షన్ మొదటి సినిమా అవడం విశేషం. ఈ సినిమాకి సహనిర్మాతగా సితార ఎంటర్టైన్మెంట్స్ ఉండబోతుంది. ఈ సినిమాకి దర్శకత్వం కళ్యాణ్ శంకర్ అని డెబ్యూ డైరెక్టర్ పరిచయం అవ్వబోతున్నారు.
అయితే కళ్యాణ్ శంకర్ కూడా జాతిరత్నలు సినిమా కి కో- రైటర్ గా పనిచేసిన అతనే. ఇప్పటికే మనం అర్ధం చేసుకోగలం ఇపుడు నవీన్ మరియు కళ్యాణ్ శంకర్ కలిసి జాతిరత్నలకు మించి బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారని. చూడాలి మరి ఈ సినిమాలో ఇంకా ఎవరెవరు నటించబోతున్నారు అనేది అధికారికంగా చిత్ర బృందం ప్రకటిస్తుంది.