Tollywood news in telugu

జూ.ఎన్టీఆర్ తో అమితాబచ్చన్ స్పెషల్ రోల్ ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘aravinda sametha veera raaghava” అనే సంగతి అందరికి తెలిసిందే. జై లవకుశ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రంలో పూజహేగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇది ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఫస్ట్ కాంబినేషన్ లో రాబోతున్న యాక్షన్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఏది చేసినా అందులో ఒక స్టైల్ కనిపిస్తుంది. అందుకోసం ఎంత ఖర్చు చేయడానికి అయినా వెనుకాడడు. అతనికి కావలసిన అవుట్ పుట్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తాడు అని మరోసారి నిరూపించాడు. తన ప్రతి సినిమాలో మనం గమనించినట్లయితే బడ్జెట్ విషయంలో ఎప్పుడు రాజీ పడడు.

ఇప్పుడు aravinda sametha veera raghava సినిమా కోసం ఓ సీన్ లో రెండు చెట్లు ఒకటి ఎండిపోయినది, ఒకటి నిండుగా పండిన ఆకులతో వున్నది కావాల్సి వచ్చింది. కాని ఒరిజినల్ గా అలాంటి చెట్లు ఆ చుట్టుపక్కలా లేకపోవడంతో ఆ సీన్ కాకుండా వేరే ఏదైనా ప్లాన్ చేద్దాం అని అనుకోకుండా త్రివిక్రమ్ వెంటనే చెన్నయ్ నుంచి ప్లాస్టిక్ ఆకులను తెప్పించి కృత్రిమంగా చెట్టుని ఆర్ట్ డైరెక్టర్ తో వేయించాడు. ఆకులు నిండిన చెట్లతో పాటు వాడిపోయిన చెట్లను కూడా లొకేషన్ లో సెట్ వేసారని సమాచారం.  ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా? చెన్నై నుంచి తెప్పించిన ఆ ఆకుల ఖరీదు ఎంతుంటుందో ఉహించగాలరా. అక్షరాలా పాతిక లక్షల రూపాయాలు. షాక్ అయ్యారా మరి.

Read  విజయ్ దేవరకొండ పై విమర్శలు...!

కాకపోతే అంతా సెట్ చేస్తే, గట్టిగా గాలి వీయడం వల్ల ఈ ప్లాస్టిక్ ఆకులు అన్ని  రాలిపోవడం, వాటిని తిరిగి అతికించడం కోసం చిత్ర యూనిట్ కి తిప్పలు తప్పలేదని న్యూస్. మరి ఇంత కాస్ట్లీ ప్రాపర్టీని సినిమాలో సాంగ్ కోసం వాడారా లేదా ఏదైనా ఫైటింగ్ సీన్స్ లో వాడారా అనేది మాత్రం సస్పెన్స్. సినిమా రిలీజ్ తర్వాతే తెలుస్తుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా వచ్చిన ‘aravinda sametha veera raghava’ ఫస్ట్ లుక్, టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. వరుస హిట్స్ తో ఎన్టీఆర్ మంచి దూకుడు మీద ఉండటంతో ‘అరవింద సమేత’ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అక్టోబర్ 11 న దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ ని ప్లాన్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. కాకపోతే అనుకోకుండా జరిగిన హరికృష్ణ గారి మరణంతో తారక్ షూటింగ్ కి కొంత గ్యాప్ ఇవ్వడంతో దానిని కవర్ చేయడానికి రాత్రింబవళ్ళు షూటింగ్ చేస్తున్నారు. ఈ మూవీలో ఒక కీలాక్ పాత్రలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ కూడా నటిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి అధికారికంగా ఎలాంటి న్యూస్ బయటకి రాలేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Read  అమితాబచ్చన్ తెలుగు సినిమాలలో నటించకపోవడానికి గల కారణం ....!

త్రివిక్రమ్‌ ఇంత పెద్ద మొత్తంలో ఒక్క ఆకుల కోసం మాత్రమే ఖర్చు చేస్తున్నాడు కాబట్టి ఈ చిత్ర నిర్మాణ వ్యయమే వంద కోట్లకి మించి బడ్జెట్ దాటే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇంత ఖర్చుతో తెరకెక్కుతున్న ఈ అరవిందుడు ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుంటాడో మరి వేచి చూడాల్సిందే.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button