Tollywood news in telugu

ట్రెండ్ అవుతున్న చరణ్ రాంబో లుక్

బాగా వైరల్ అవుతున్న రామ్ చరణ్ కండలు తిరిగిన ఫోటో

ఈ మధ్య ప్రీరిలీజ్ జరుపుకున్న రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా వినయ విధేయ రామ, సంక్రాంతి కానుకగా ఈనెల పదకొండవ తేదీన సంక్రాంతి కానుకగా మన ముందుకు వస్తుంది. అయితే టీజర్ లో కనిపిస్తున్న కండలు తిరిగిన బాడీ ఫోటోలు హాలీవుడ్ రాంబో ని గుర్తుకు చేస్తున్నాయ్. బాలీవుడ్ షారుక్ , సల్మాన్, హృతిక్ లాంటి లుక్ కి తగ్గకుండా ఉంది. చరణ్ భార్య ఉపాసన కూడా ఈ మధ్య నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దాంతో నెటిజన్ ల దృష్టి మరింత పడింది.

అసలు ఆ బాడీ కోసం ఎంత కష్టపడ్డాడు అంటే రోజుకు నాలుగు గంటల పాటు శారీరక కసరత్తులు ఫిట్నెస్ ట్రైనర్ సమక్షంలో చేస్తూ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఇలాంటి ధృడమైన సౌష్టవం పొందాడు అని తెలిపారు.ఆహారం విషయంలో కొన్నిటిని వదిలేసి, అవసరం అయిన వాటిని మాత్రమే మూడునెలల పాటు తిన్నాడుట. బొయపాటి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఈ సినిమా కోసం చరణ్ లుక్ విషయంలో బాగా జాగ్రత్తలు తీసుకున్నాడు అంటు టీం తెలిపింది.

Read  Bebamma - బెబామ్మ డబ్బుల బాట పటిందే ?
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button