Tremendous Response for Radhe Shyam Video : ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులే లేవు :-

Tremendous Response for Radhe Shyam Video : అవును ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులే లేవు. దీని గురించి మీకు తెలిసే ఉంటుంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సంక్రాంతి పండుగకు విడుదల కాబోతున్న రాధే శ్యామ్ చిత్రబృందం నుంచి ప్రభాస్ అలియాస్ విక్రమాదిత్య క్యారెక్టర్ వీడియో రిలీజ్ చేశారు.
ఈ వీడియో చూశాక ప్రభాస్ ఫ్యాన్స్ ఏ కాదు , సదరు తెలుగు సినిమా ప్రేమికుడు కూడా గర్వాంగా ప్రభాస్ సినిమా రా అని చెప్పుకుంటున్నారు , సోషల్ మీడియా అంత రాధే శ్యామ్ హవాతో నిండిపోయింది.
వీడియో అంత ప్రభాస్ ఇంగ్లీష్ లో మాట్లాడినప్పటికీ ప్రభాస్ స్టైల్ , మ్యానరిజం , డైలాగ్స్ అబ్బో చెప్పుకుంటే పోతే వీడియో అంత ఓ రేంజ్ లో ఉంది.అయితే ఈ సినిమాలో ప్రభాస్ నెవెర్ బిఫోర్ రోల్ లో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ అలియాస్ విక్రమాదిత్య పాల్మీస్ట్ (హస్తసాముద్రికుడు ) గా కనిపించబోతున్నారు. సినిమాటోగ్రఫీ అయితే వేరే లెవెల్.
ఈ చిన్న వీడియో తోనే ఇన్నిరోజులు ఈ సినిమా మీద ఉన్న అనుమానాలు కొట్టిపాడేసేటట్లు చేశారు చిత్ర బృందం. ఇదిలా ఉండగా ఈ సినిమా ముందుగా అనుకున్న తేదీనే అనగా జనవరి 14 న విడుదల అవ్వబోతుంది అని వీడియో లోకూడా చూపించారు.
మొత్తానికి ప్రభాస్ అభిమానులే కాదు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ గర్వించే దగ్గ సినిమా మరియు సినిమా స్టాండర్డ్స్ ని ప్రపంచానికి చాటిచెప్పేలా రాధే శ్యామ్ ని చిత్రీకరించారని అర్ధం అవుతుంది. చూడాలి మరి ఆర్.ఆర్.ఆర్ కి పొట్టిగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ సృష్టించ బోతుందో.