మీ డబ్బులను పొరపాటుగా వేరే వారికీ ఆన్ లైన్ లో ట్రాన్స్ఫర్ చేశారా? అయితే ఆ మొత్తాన్ని తిరిగి పొందవచ్చు…ఎలాగంటే…!

Transferred Money to a Wrong Account: మీకు బ్యాంక్ వెళ్లే సమయం లేక , లేదంటే టైం సేవ్ చేయడనికి తరచూ ఆన్లైన్ బ్యాంక్ ట్రాన్సక్షన్స్ చేస్తుంటారా? అలా చేస్తున్నపుడు పొరపాటున ఎప్పుడైనా తప్పుడు నెంబర్ ఎంటర్ చేసి వేరే అకౌంట్లోకి నగదు బదిలీ చేశారా.? అయితే కంగారు పడకండి. మల్లి మీ డబ్బును మీరు తిరిగి రాబట్టచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం .!
ఈ కరోనా కారణంగా ఆన్లైన్ డబ్బు బదిలీలు ఎక్కువైపోయాయి. ఫోన్ పే, గూగుల్ పే, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ), పేటిఎమ్, నెట్ బ్యాంకింగ్, వంటి ఎన్నో రకాల థర్డ్ పార్టీ నగదు లావాదేవీల యాప్స్ పుట్టుకొచ్చాయి. వీటిద్వారా బ్యాంకులకు వెళ్లి లైన్ లో నిల్చోనవసరం లేకుండానే, జనాలు డబ్బును ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. వీటిపైనే చాలామంది ఆధారపడుతున్నారు. వీటిద్వారా సమస్యలు కూడా ఉంటున్నాయి..

మీరు పొరపాటున మీ సమ్మును వేరొకరి ఖాతాకు బదిలీ చేస్తే, ఆ నగదును మళ్లీ ఎలా తిరిగి పొందాలి ? ఆ డబ్బును తిరిగి మల్లి మీ ఖాతాలోకి జమచేసే అధికారం బ్యాంకుకు ఉంటుందా ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇపుడు తెలుసుకుందాం
ఎపుడైనా మీరు పొరపాటున మీకు తెలియని అకౌంట్లోకి డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తే… ఆ మొత్తాన్ని తిరిగి రివర్స్ చేసే అధికారం బ్యాంకులకు ఉండదు. ఎప్పుడైతే లబ్దిదారుడు.. బాధితుడిపై దయతలచి ఇవ్వాలె తప్ప .. బ్యాంకులకు ఆ డబ్బును తిరిగి రివర్స్ చేసే అధికారం ఉండదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. ఇలాంటి ట్రాన్సక్షన్లలో బ్యాంక్ లు కేవలం ఫెసిలిటేటర్‌గా మాత్రమే పనిచేయగలదని bankbazaar.com సీఈఓ, సహ వ్యవస్థాపకుడు అధిల్ శెట్టి తెలిపారు.
పొరపాటున డబ్బు వేరే అకౌంట్ లోకి వెళితే , ఆ డబ్బును తిరిగి ఎలా పొందవచ్చు .?
మీరు వెంటనే మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి జరిగిన విషయం స్పష్టంగా తెలియజేయాలి. లావాదేవీ జరిగిన టైం , తేదీతో పాటు, నగదు తప్పుగా బదిలీ అయిన మొత్తం డబ్బు , ఖాతా నంబర్‌ను కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌కు తెలపాలి. ఇలాచేయడం వల్ల తప్పు ఖాతాలోకి వెళ్లిన డబ్బు 10 పనిదినాల్లో తిరిగి మీ అకౌంట్‌కు వచ్చిచేరుతుంది.
ఒకవేళ అలా జరగకుంటే … మీరు మీ బ్యాంకును సంప్రదించి, తప్పుగా జరిగిన లావాదేవీల విషయాన్నీ ప్రూఫ్స్ తో సహా మేనేజర్‌కు వెల్లడించాలి. అపుడు ఆ ఖాతాదారుడి వివరాలు సేకరించి నగదును 10 రోజుల్లో అందేలా చేస్తారు. ఒక్కోసారి నెల రోజులు కూడా పట్టే అవకాశం కూడా ఉంటుంది.
ఒక వేళా లబ్ధిదారుడు మీ డబ్బును తిరిగి ఇవ్వకుంటే .?

మీరు పద్దతి ప్రకారం అడిగినాకని ఆ వ్యక్తి తిరిగి మీ డబ్బును ఇవ్వడానికి నిరాకరిస్తే… చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఒకవేళ మీ బ్యాంక్ ఖాతా ఒక దగ్గర , లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతా మరో దగ్గర ఉంటె కొంత సమయం తీసుకుంటుంది.
మీ సొమ్మును లబ్ధిదారుడు తిరిగి ఇవ్వడానికి సహకరిస్తే.?
మీ సొమ్ము తిరిగి మీ ఖాతాలోకి చేరడానికి వారం నుండి పది రోజుల సమయం తీసుకుంటుంది. దీనికోసం మీరు లావాదేవీని ఖచ్చితమైన బ్యాంక్ స్టేట్మెంట్, అడ్రస్ , ఐడి ప్రూఫ్ , ఖాతా బుక్ లాంటివి బ్యాక్ కి ఇవ్వాల్సి ఉంటుంది.