Tollywood news in telugu

Trailer of MAMAMGAM in Telugu very soon. One of the biggest films made in Malyalam staring mega star @mammukka produced by Venu Kunnapillay & directed by Padham Kumar.

డిసెంబర్ 3న సూపర్ స్టార్ మమ్ముట్టి మామాంగం ట్రైలర్ విడుదల
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక విభిన్నమైన కథతో మన ముందుకు రానున్నారు. కేరళ రాష్ట్ర చరిత్రలోని ఒక అద్భుతమైన కథతో ఆయన నటించిన `మామాంగం’ మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందించారు. జమోరిన్ పాలనలో చావెరుక్కళ్ యుద్ధ వీరుల చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ   హిస్టారిక‌ల్ మూవీలో ఎన్నడూ చూడనటువంటి విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు మమ్ముట్టి. అతి ప్రాచీనమైన కలరి విద్యలోని విశిష్టతను ఇంతకు ముందు ఎవరూ చూపించినంతగా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఎం. పద్మకుమార్ దర్శకత్వంలో కావ్య ఫిల్మ్ కంపెనీ పతాకంపై వేణు కున్నపిళ్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ఆయన లేడీ గెటప్ లో కనిపించనున్నారు. ఈ క్యారెక్టర్ సినిమాలో చాలా కీలకం. ఇది ఏ సందర్భంలో వస్తుంది అనేది మాత్రం సర్ ప్రైజ్. ఈ లేడీ గెటప్ లుక్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ట్రైలర్ విడుదలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 3న ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ….. “1695వ  సంవత్సరంలో జరిగిన ఒక నిజమైన కథతో, ఇంతకు ముందెన్నడూ చూడనటువంటి విజువల్స్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారూ. మామాంగం` చిత్ర ట్రైలర్ ను డిసెంబర్ 3న, చిత్రాన్ని డిసెంబర్ 12న  ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం ” అని తెలిపారు.
తారాగణం:
మమ్ముట్టి,ప్రాచి తెహెలన్,ఉన్ని ముకుందన్,మోహన్ శర్మ,అను సితార,ప్రాచీ దేశాయ్,మాళవికా మీనన్,అభిరాం అయ్యర్ తదితరులు
సాంకేతిక బృందం :
డైరెక్టర్: ఎం. పద్మకుమార్
ప్రొడ్యూసర్: వేణు కున్నపిళ్లి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వివేక్ రామదేవన్, ఆయుజో ఆంటోనీ,
అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : శంకర్ రామకృష్ణన్
డైలాగ్స్ : కిరణ్
డి.ఓ.పి: మనోజ్ పిళ్ళై
యాక్షన్: శామ్ కౌశల్
వి.ఎఫ్.ఎక్స్: ఆర్.సి. కమలకన్నన్
ప్రొడక్షన్ డిజైనర్: మోహన్ దాస్
ఎడిటర్: రాజా మొహమ్మద్
మ్యూజిక్: ఎం. జయచంద్రన్
బి.జి.ఎం: సంచిత్ బల్హారా & అంకిత్ బల్హారా
పిఆర్ఓ : ఏలూరు శ్రీను
https://we.tl/t-s4fNnkTXiY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button