రోడ్డుపై ట్రాఫిక్ కానిస్టేబుల్ డాన్స్…

మనం పోలీసులను చూస్తేనే భయపడతాం. “ఫ్రెండ్లీ పోలీసింగ్” అంటు.. వారెప్పుడూ గంభీరంగా ఉంటారు. కానీ ఒక చోట ఒక పోలీస్ ఆఫీసర్ ని చూస్తే టెన్షన్స్ ఉన్నవారికి టెన్షన్ వెళ్ళిపోతుంది.. మూడు అప్సెట్ ఉన్నవారు చూస్తే… పెదవి వెంటా చిరునవ్వు చిందిస్తారు.

అసలు విషయం ఏమిటంటే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లో రంజీత్ సింగ్ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి డ్యాన్స్ అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి పెద్ద డ్యాన్సర్ అవ్వాలనేది తన కోరిక.. కానీ అతని ఆర్థిక, సామాజిక పరిస్థితుల వల్ల డ్యాన్సర్ కాలేకపోయాడు.

ట్రాఫిక్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న.. తన డాన్స్ పై రంజిత కు ఇష్టం పోలేదు …అందుకే 16 ఏళ్లుగా ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి రంజిత్ సింగ్ డ్యాన్స్ స్టెప్పులతో వాహనదారులకు సిగ్నల్ ఇచ్చేవాడు. అతను వేసే డాన్స్ స్టెప్పులను చూసి… వాహనదారులు తమకున్న టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి ఒకసారి సరదాగా నవ్వుకుంటారు. దీంతో ఇలా వినూత్నంగా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.