Today Telugu News Updates

TPCC ప్రెసిడెంట్ ఎన్నిక షురూ….

బిజెపిలో చేరే వారు ముఖ్య నాయకులు కాదని , వారు ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్నవారు కాదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహా రాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ వ్యాఖ్యానిం చారు . టిపిసిసికి కొత్త అధ్యక్షుని ఎంపిక ప్రక్రియ మొదలైందని , ఇందులో భాగంగా తాను మూడు రోజుల్లో వివిధ హోదాల్లోని 150 మందికి పైగా కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు స్వీకరిస్తానని తెలి పారు . అనంతరం తాను ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి నివేదిక ఇస్తానని , కొత్త అధ్యక్షు డిని ఎప్పుడు ప్రకటించాలనేది ఆమె ఇష్టమని , అప్పటి వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ బాధ్యతల్లో కొనసాగుతారని చెప్పారు . టిపిసిసి అధ్యక్షునిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుని ఎంపిక ప్రక్రియలో భాగంగా మూడు రోజుల పర్యటన నిమిత్తం మాణిక్కం ఠాగూర్ బుధవారం హైదరాబాదు వచ్చారు .

TPCC ప్రెసిడెంట్ ఎన్నిక షురూ….

ఈ సందర్భంగా ఉత్తమ్ , సిఎల్ పి నేత మల్లు భట్టి విక్ర మార్కలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో ఆయన మాట్లాడారు . టిపిసిసి అధ్యక్షు నిగా జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటమికి ఉత్తమ్ నైతిక బాధ్యత వహించడం అభినందనీయమని , ఒక నాయకుడు కేవలం అధికారం తీసుకోవడమే కాకుండా , బాధ్యత వహించడం కూడా ముఖ్యమే నని తెలిపారు . ఉత్తమ్ కుమార్‌ రెడ్డి తన పదవీ కాలంలో చాలా కష్టపడ్డారని , అవిశ్రాంతంగా పని చేశారని , తాను స్వయంగా దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా దగ్గర నుండి పరిశీలించానని తెలి పారు . ఇంత కాలం బాధ్యతలను నిర్వర్తించినందుకు ఆయనకు తన , ఎఐసిసి తరుపున కృతజ్ఞ తలు తెలియజేస్తున్నట్లు ఠాగూర్ అన్నారు . దుబ్బాక ఉప ఎన్నికల ఓటమిని అధిగమిస్తామని , త్వరలోనే పూర్వ వైభవానికి వస్తామని ధీమా వ్యక్తం చేశారు . తాను జిహెచ్ఎంసి ఎన్నికల్లో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసానని , తదుపరి ప్రక్రియ నిమిత్తం మాణిక్కం ఠాగూర్ హైదరాబాదు వచ్చినట్లు ఉత్తమ్ తెలిపారు . కోర్ కమిటీ భేటీ : బుధవారం రాత్రి మాణిక్కం ఠాగూర్ గాంధీభవ లో టిపిసిసి కోర్ కమిటీ సమావేశానికి హాజర య్యారు .

టిపిసిసి అధ్యక్షులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కోర్ కమిటీ సమావేశంలో సభ్యులు మల్లు భట్టి విక్రమార్క , కె.జానారెడ్డి , పొన్నాల లక్ష్మయ్య , వి.హనుమంతరావు , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , ఎ.రేవంత్ రెడ్డి , మధు యాష్కీ గౌడ్ , వంశీచంద్ రెడ్డి , సంపత్ కుమార్ , జగ్గారెడ్డి , డి.శ్రీధర్ బాబు , దామోదర రాజనర్సింహా , గీతా రెడ్డి , సీతక్క , జీవన్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు . ఈ సందర్భంగా పిసిసి ఎంపిక ప్రక్రియ గురించి మాణిక్కం వివరించారు . అనంతరం కోర్ కమిటీ సభ్యులను ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశమై అభిప్రాయాలు సేకరించారు . గురువారం రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎఐసిసి సభ్యులు , మాజీ కేంద్ర మంత్రులు , మాజీ రాష్ట్ర మంత్రులు , మాజీ ఎంఎలు , మాజీ ఎంఎల్‌సిలు , అను బంధ సంఘాల నాయకులు , డిసిసి అధ్యక్షులతో వేర్వేరుగా సమావేశమై అభిప్రాయాలు తీసుకుం టారు . మూడవ రోజున ఇంకా ఎవరైనా కలవాల నుకుంటే వారి నుండి పిసిసి విషయంలో అభిప్రా యాలు తీసుకోనున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button