technology information

Top IT High Paying Jobs : ఫ్యూచర్లో ఈ కోర్సులకు ఫుల్ డిమాండ్.. త్వరగా నేర్చుకోండి!

Top IT High Paying Jobs : రోజురోజుకి సాఫ్ట్వేర్ ఎంత విస్తరిస్తుందో మనం చూస్తూ ఉన్నాము. టెక్నాలజీ పెరుగుతున్నదానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీలు ,కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లు మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే ఏ ఫీల్డ్ లో లేనంత గా సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉద్యోగులకు జీతాలు ఉన్నాయి. దీంతో బ్రాంచితో సంబంధం లేకుండా విద్యార్థులు సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుంటున్నారు. ఈ కోర్సులు నేర్చుకున్న వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి.

1. ఫుల్ స్టాక్ డెవలపర్:

ఫుల్ స్టాక్ అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్.. ఈ జాబ్ రోల్ కి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, ఫ్రేమ్ వర్క్స్ వచ్చి ఉండాలి. దాంతోపాటు బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఒక డేటా బేస్ కూడా నేర్చుకుని ఉండాలి.

జీతం : 6LPA

2. డేటా సైంటిస్ట్ :

డేటాని కలెక్ట్ చేసి అనలైజ్ చెయ్యాలి. స్టాటస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ పైన నాలెడ్జ్ ఉండాలి. అలాగే మిషన్ లెర్నింగ్ డీప్ లర్నింగ్, డేటా విజువలైజేషన్ వంటివి వచ్చి ఉండాలి.

జీతం : 11LPA

3. మిషన్ లెర్నింగ్ ఇంజనీర్:

పైతాన్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. స్టాటస్టిక్స్ ప్రాబబిలిటీ పైన మంచి అవగాహన ఉండాలి. డేటా స్ట్రక్చర్స్ వచ్చి ఉండాలి.

జీతం : 9LPA

4. సెక్యూరిటీ ఇంజనీర్స్ :

సెక్యూరిటీ ఇంజనీర్స్ అంటే సైబర్ సెక్యూరిటీ.. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. సిస్టం అండ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటివ్ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి.

జీతం : 5LPA

5. బ్లాక్ చైన్ డెవలపర్స్

పెద్ద పెద్ద కంపెనీలో బ్లాక్ చైన్ టెక్నాలజీని డేటా ట్రాన్సాక్షన్స్ కోసం వాడుతారు. దీంతో ఈ జాబ్ కోసం ట్రై చేసే వారికి బ్లాక్ చైన్ టెక్నాలజీ పై పూర్తిగా అవగాహన ఉండాలి

జీతం : 7.5LPA

6. రోబోటిక్స్ ఇంజనీర్

చాలా మంది రోబోటిక్స్ అంటే ఎలక్ట్రానిక్స్ వాళ్లకు సంబంధించిందని అనుకుంటారు. కానీ రోబోటిక్స్ లో కూడా సిస్టమ్ ఇన్స్టాలేషన్ వంటివి సాఫ్ట్వేర్ వాళ్లే చేస్తారు.

జీతం : 5LPA

7. డేవాప్స్ ఇంజనీర్

ఎవరికైతే క్లౌడ్ పైన గాని, సాస్ పైన గాని ఎక్స్పీరియన్స్ ఉంటే వారు ఈ డేవాప్స్ ఇంజనీర్ గా ట్రై చేయవచ్చు.

జీతం : 7.5LPA

8. ఏడబ్ల్యూఎస్ డెవలపర్

ఇది టాప్ క్లౌడ్ ప్లాట్ఫామ్. క్లౌడ్ టెక్నాలజీ, క్లౌడ్ డెవలప్మెంట్ సిస్టమ్స్ పైన సరైన అవగాహన ఉండాలి

జీతం : 5.5LPA

9. ఆండ్రాయిడ్ డెవలపర్

ఈ రోల్ కోసం ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలి అలాగే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ తెలిసి ఉండాలి

జీతం : 5.5LPA

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button