telugu facts

అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చలనచిత్రాలు-part 2

ప్రస్తుత కాలoలో ఒక మూవీ కమర్షియల్ గా విజయం సాధించింది అని చెప్పాలి అంటే ప్రధానంగా దాని బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పై ఆధారపడి ఉంటుంది. ప్రతి బాలీవుడ్ సినిమా విడుదల సమయంలో, బాక్స్ ఆఫీస్ వసూళ్లు షఫుల్ చేయబడుతుoటాయి మరియు ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ భారతీయ సినిమా కలెక్షన్స్ విషయంలో తన బిజినెస్ ని పెంచుకుంటూపోతుంది. భారతదేశంలో అత్యధిక వసూళ్లు చేసిన కొన్ని మూవీస్ లిస్టు ని ఇప్పుడు చూద్దాం.

14.ప్రేమ్ రతన్ ధన్ పాయో (2015) – రూ. 432 కోట్లు

సూరజ్ బరజత్య మరియు సల్మాన్ ఖాన్ నాల్గవ సారి వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన , ఈ చిత్రం 2015 లో విడుదలైంది మరియు వాణిజ్యపరంగా విజయం సాధించింది. ప్రేమ్ రతన్ ధన్ పాయోలో సోనమ్ కపూర్ నటించింది. ఈ చిత్రం రూ. 432 కోట్లు అత్యధిక అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలలో పన్నెండవ స్థానంలో నిలిచింది.

 1. చెన్నై ఎక్స్ ప్రెస్ (2013) – రూ. 423 కోట్లు

చెన్నై ఎక్స్ ప్రెస్ షారుఖ్ ఖాన్ సినిమాలలో ఒకటి, రోహిత్ శెట్టి దర్శకత్వం వహిoచిన  ఈ రొమాంటిక్ యాక్షన్ కామెడీ చిత్రం ముంబయి నుండి రామేశ్వరం వరకు ఒక మనిషి ప్రయాణం గురించిన కథ, ఈ చిత్రం రూ. 423 కోట్ల వసూళ్లు సాధించింది మరియు పదమూడవ స్థానంలో నిలిచింది. ఈ చిత్రం ఓవర్ సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన షారుక్ ఖాన్ మూవీస్ లో ఒకటి.

 1. దిల్వాలే (2015) – 408.15 కోట్లు

దిల్వాలే 2015 లో వచ్చిన రొమాంటిక్ కామెడీ చిత్రం షారూఖ్ ఖాన్, కాజోల్, వరుణ్ ధావన్ మరియు కృతి సనన్ ప్రధాన పాత్రలలో జానీ లివర్, బోమన్ ఇరానీ, పంకజ్ త్రిపాఠి సహా ప్రధాన పాత్రలలో నటించారు. రోహిత్ షెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొత్తం Box Office వద్ద రూ . 408.15 కోట్లు కలెక్ట్ చేసింది

 1. కిక్ (2014) – రూ. 402 కోట్లు

సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో సజిద్ నడియాద్వాలా నిర్మించిన మరియు దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం, ఇది రవితేజ నటించిన తెలుగు చిత్రం యొక్క రీమేక్. హిందీలో  జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రండప్ హూడా మరియు మిథున్ చక్రబర్తి నటించారు. మొత్తం రూ. 402 కోట్లు ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు చేసింది.

 1. హ్యాపీ న్యూ ఇయర్ (2014) – రూ. 397 కోట్లు

దర్శకుడు ఫరాఖాన్ మరియు నటుడు, నిర్మాత షారుక్ ఖాన్ల కాంబినేషన్ లో వచ్చిన అనేక మూవీస్ లో హ్యాపీ న్యూ ఇయర్ ఒకటి. దీపికా పడుకొనే, అభిషేక్ బచ్చన్, సోనూ సూద్, బొమన్ ఇరానీ, వివన్ షా (నసీరుద్దిన్ షా కుమారుడు) మరియు జాకీషరాఫ్ ఈ మూవీలో నటించారు. Box Office వద్ద రూ. 397 కోట్లు కలెక్ట్ చేసింది.

 1. క్రిష్ 3 (2013) – రూ. 374 కోట్లు

క్రిష్ సీరీస్ లో నాల్గవ పార్ట్ గా రాకేష్ రోషన్ తీసిన క్రిష్ 3 సైన్స్ ఫిక్షన్ లో హృతిక్ రోషన్ సూపర్ హీరోగా నటించారు. ప్రియాంకా చోప్రా, కంగానా రనౌత్ మరియు వివేక్ ఒబెరాయ్ నటించిన ఈ చిత్రం, రూ. 374 కోట్లు ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది.

 1. బాజిరావ్ మస్తాని (2015) – రూ. 362.41 కోట్లు

సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వం వహించిన బజీరావు మస్తాన్ స్టార్ రణవీర్ సింగ్ బాజీరావ్, దీపికా పడుకొనే మస్తాని, ప్రియాం చోప్రా రావ్ భాజీరావ్ మొదటి భార్య కాశీబాయిగా, సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో తన్వి అజ్మీ, మిలింద్ సోమన్ తదితరులు నటించారు. ఈ పురాణ చారిత్రిక రొమాన్స్ చిత్రం Box Office వద్ద 362.41 కోట్లు కలెక్ట్ చేసింది.

 1. ఏక్ థా టైగర్ (2012) – రూ. 350 కోట్లు

కబీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ తో కలిసి మొదటిసారిగా 2012 లో ఒక రొమాంటిక్ స్పై థ్రిల్లర్ మూవీ ఏక్ థా టైగర్ లో పని చేసారు. కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది. ఆదిత్య చోప్రా నిర్మాత, ఈ చిత్రం రూ. ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లు కలెక్ట్ చేసింది.

 1. బ్యాంగ్ బ్యాంగ్ (2014) – రూ. 340 కోట్లు

సిద్దార్థ్ ఆనంద్ యాక్షన్ కామెడీ బ్యాంగ్ బ్యాంగ్! హాలీవుడ్ చిత్రం నైట్ అండ్ డే యొక్క అఫీషియల్ రీమేక్. హృతిక్ రోషన్ యొక్క చార్మ్ మరియు యాక్షన్ సన్నివేశాలు ఈ మూవీ హైలైట్. కత్రినా కైఫ్ ఈ చిత్రంలో అందమైన మరియు అమాయకమైన అమ్మాయిగా  కనిపిస్తోంది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మాణ చిత్రం అయిన బ్యాంగ్ బ్యాంగ్ ప్రపంచవ్యాప్తంగా రూ. 340 కోట్లు వసూలు చేసింది.

 1. హిందీ మీడియం (2017) – రూ. 334.36 కోట్లు

హిందీ మీడియం ఇర్ఫాన్ ఖాన్ మరియు పాకిస్తానీ నటి సాబా కమార్ ప్రధాన పాత్రలలో నటించగా, దీపక్ దోబ్రియాల్ ఒక ముఖ్య పాత్రలో నటించారు. సాకేత్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, స్లీపర్ హిట్ గా మారి, చైనాలో కూడా విపరీతమైన వ్యాపారం చేసింది. భారతీయ చలనచిత్ర రంగంలో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ .334.36 కోట్లు, హిందీ మీడియం  చిత్రం సంపాదించింది.

 1. యే జవాని హై దివాని (2013) – రూ. 318 కోట్లు

రణబీర్ కపూర్ తో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తీసిన రొమాంటిక్ డ్రామా చిత్రం యే జవానీ హై దివాని. దీపికా పడుకొనే, కల్కి కచేన్ మరియు ఆదిత్య రాయ్ కపూర్ కూడా ఇందులో నటించారు. ఈ చలన చిత్రం యువకులను బాగా ఆకర్షించింది మరియు ప్రపంచవ్యాప్తంగా  Box Office వద్ద రూ. 318 కోట్లు కలెక్ట్ చేసింది.

 1. గోల్ మాల్ అగైన్ (2017) – రూ. 310 కోట్లు

రోహిత్ శెట్టి గోల్ మాల్ సీరీస్ లో నాల్గవ పార్ట్ ఇది ఒక కామెడీ హారర్ మూవీ. అజయ్ దేవగ్, పరినీతి చోప్రా, అర్షద్ వార్సీ, శ్రేయస్ తల్పెడే, తుషార్ కపూర్, కునాల్ ఖేము మరియు టబు తదితరులు నటించారు, ఈ చిత్రం అనేక రికార్డులను బ్రేక్ చేసింది మరియు ప్రపంచవ్యాప్తంగా రూ.310 కోట్లు కలెక్ట్ చేసింది.

 1. రాయిస్ (2017) – రూ. 308.88 కోట్లు

గుజరాత్లో జరిగే అక్రమ మద్యం వ్యాపారాలపై ఆధారపడిన రాహుల్ డోలకియా యొక్క యాక్షన్ చిత్రం “రాయిస్” లో షాక్ రుక్ ఖాన్ తన క్రిమినల్ యాంగిల్ ని చూపించారు . ఈ చిత్రంతో బాలీవుడ్ లోకి మహరా ఖాన్ అడుగుపెట్టింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 308.88 కోట్లు కలెక్ట్ చేసింది.

27.ఎంటిరన్ (రోబోట్) (2010) – రూ. 285 కోట్లు

రోబోట్ అని కూడా పిలువబడే ఎంటిరన్, తెలుగు మరియు హిందీలో కూడా డబ్ చేసిన రజనీకాంత్ నటించిన తమిళ చిత్రం. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్, డానీ డెన్జాంగ్పా, సంతానం మరియు కరుణాస్ నటించారు. ఈ చలన చిత్రం యొక్క సంగీత దర్శకుడు A.R. రెహమాన్. రెండు జాతీయ చలన చిత్ర అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం మొత్తం Box Office వద్ద రూ. 289 కోట్లు కలెక్ట్ చేసింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button