Banana: రోజుకో అరటి పండుతో అద్భుత ప్రయోజనాలు
రోజూ మధ్యాహ్నం ఒక అరటిపండు తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు అరటి పండులో ఉన్నాయి. రోజూ అరటి పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలను మనం ఒకసారి పరిశీలిస్తే..
అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తనాళాలను క్రమబద్దీకరించడంలో సహాయపడుతుంది.

మధుమేహం ఉన్నవారు కొన్ని రకాల అరటిపండ్లను వైద్యుల సలహా మేరకు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది.
అరటిపండ్లు తీసుకోవడం వల్ల శరీరంలో నీటిస్థాయి ఆశ్చర్యకరమైన రీతిలో అదుపులోకి వస్తుంది.
మలబద్దకంతో బాధపడేవారికి ఔషదాల కంటే అరటి పండు చాలా ఉత్తమమైనది. అరటి పండులో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య నుంచి విముక్తి కలుగుతుంది.
రక్తనాళాల్లో గ్లూకోజ్ స్థాయి మీద సానుకూల ప్రభావం చూపించే బి6 విటమిన్ అరటిపండ్లలో అధికంగా ఉంటుంది. ఈ విటమిన్లు కడుపునొప్పి, ఛాతి నొప్పి, మానసిక సమస్యలను నియంత్రించడంలో సహాయం చేస్తాయి.