telugu facts

అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చలనచిత్రాలు part-1

ప్రస్తుత కాలoలో ఒక మూవీ కమర్షియల్ గా విజయం సాధించింది అని చెప్పాలి అంటే ప్రధానంగా దాని Box Office కలెక్షన్స్ పై ఆధారపడి ఉంటుంది. ప్రతి బాలీవుడ్ సినిమా విడుదల సమయంలో, బాక్స్ ఆఫీస్ వసూళ్లు షఫుల్ చేయబడుతుoటాయి మరియు ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ భారతీయ సినిమా కలెక్షన్స్ విషయంలో తన బిజినెస్ ని పెంచుకుంటూపోతుంది. భారతదేశంలో అత్యధిక వసూళ్లు చేసిన కొన్ని మూవీస్ లిస్టు ని ఇప్పుడు చూద్దాం.

1.దంగల్ (2016) – రూ. 2,209.3 కోట్లు

అమీర్ ఖాన్ ఈ మూవీలో మహావిర్ సింగ్ ఫోగత్గా నటించారు.  ఈ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చలన చిత్రాల్లో ఒకటి, తన కుమార్తెలను కుస్తీ పోటిలకు సన్నద్ధం చేసి, 2010 కామన్వెల్త్ క్రీడలలో కుస్తీ పోటీల్లో బంగారు పతకాన్ని పొందిన భారత తొలి మహిళగా తీర్చిదిద్దిన మహావీర్ సింగ్ లాంటి ఒక గొప్ప తండ్రిగా అమీర్ ఖాన్ అద్భుతంగా నటించాడు. Box Office వద్ద ఈ సినిమా రూ. 2,209.3 కోట్లు సంపాదించి  అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రం అయింది.

2. బాహుబలి 2: కంక్లూజన్ (2017) – రూ. 1,792.08 Cr

S.S. రాజమౌళి యొక్క బాహుబలి 2 మనం చెప్పాలనుకునే కథని దానిపై మనసు మరియు ప్రాణం పెట్టి అద్భుతంగా చిత్రీకరిస్తే అది సాధించే విజయంకి భాష అవరోధం కాదు అని నిరూపించింది. 2017లో ఈ చిత్రం 1000 కోట్లు క్రాస్ చేసిన మొదటి చిత్రం. ఇది ఒక ల్యాండ్ మార్క్ మరియు అత్యధిక Box Office కలెక్షన్స్ ని క్రియేట్ చేసింది. ఈ చిత్రం భారతదేశంలోని టాప్ వరల్డ్ వైడ్ గ్రాసర్ మరియు ఇది అన్ని Indian Box Office Records బ్రేక్ చేసింది.

3. సీక్రెట్ సూపర్ స్టార్ (2017) – రూ. 975.34 కోట్లు

సీక్రెట్ సూపర్ స్టార్ తో అద్వైత చరణ్ దర్శకత్వం వహించిన చిత్రం అతనికి అతిపెద్ద గుర్తింపు ఇచ్చింది. జైరా వసీం, మెహర్ విజ్, రాజ్ అర్జున్ మరియు అమీర్ ఖాన్ నటించిన ఈ సినిమాని ఆయన చేశారు. ఈ మ్యూజికల్ డ్రామా ఫిలిం ఒక ప్రముఖ గాయనిగా మారి ప్రపంచవ్యాప్తంగా అందరి హృదయాలను కొల్లగొట్టిన ఒక యంగ్ గర్ల్ ప్రయాణం ఎలా సాగింది అనేది. ప్రత్యేకించి అమీర్ ఖాన్ ఉండడం ఈ మూవీ ఇంత విజయం సాధించడానికి మరో కారణం. ఇది చైనాలో కూడా రన్ అయ్యింది మరియు రూ. ప్రపంచవ్యాప్తంగా 975.34 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది.

  1. బజరంగి భాయిజాన్ (2015) – రూ. 970.05 కోట్లు

సల్మాన్ ఖాన్ నటించిన బజరంగి భాయిజాన్ అతని కెరీర్ లో పెర్ఫార్మన్స్ పరంగా మరియు కమర్షియల్ గా ఉత్తమమైనది. సల్మాన్ ప్రతి చిత్రం దాదాపు 100 కోట్ల మార్క్ ఈజీగా క్రాస్ చేస్తుంది. కాని ఈ చిత్రంలో కంటెంట్ చాలా బలంగా ఉంది మరియు సల్మాన్ ఖాన్ కొన్ని భావోద్వేగ సన్నివేశాలలో అద్భుతంగా నటించాడు. ఈ మూవీ మొత్తం రూ. 970.05 కోట్లు కలెక్ట్ చేసి 6 వ స్థానంలో నిలిచింది.

  1. PK (2014) – రూ. 854 కోట్లు

అమీర్ ఖాన్ ఎప్పుడు ఒకేలా ఉండే రొటీన్ పాత్రలనే కాకుండా ప్రయోగాత్మక సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. PK మూవీ రూ. 854 కోట్లు Box Office వద్ద మరియు ఇండియన్ సినిమాలో అత్యధిక వసూళ్లు చేసిన నాల్గవ స్థానంలో నిలిచింది. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఒక బలమైన సందేశాన్ని ఇచ్చింది, దానితో అనేకమంది వ్యక్తులు కనెక్ట్ అయ్యారు మరియు భారీ విజయం సాధించారు.

  1. కబాలి (2016) – రూ. 659 కోట్లు

కబాలి అనేది రజనీ కాంత్ ప్రధాన పాత్రలో నటించిన 2016 లో విడుదలైన తమిళ చిత్రం. ఈ చిత్ర దర్శకుడు పి.రంజిత్ దర్శకత్వం వహించారు, రాధిక అప్టే, విన్స్టన్ చావో, ధన్సికా మరియు దినేష్ రవి తదితరులు నటించారు. కబాలి తెలుగు మరియు హిందీలో కూడా డబ్బింగ్ చేయబడింది మరియు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది, మొత్తం బాక్స్ ఆఫీసు వసూలు రూ. 659 కోట్లు.

  1. బాహుబలి: ది బిగినింగ్ (2015) – రూ. 650 కోట్లు

రాజమౌళి యొక్క మాగ్నమ్ సిరీస్ మొదటి భాగం, బాహుబలి: ది బిగినింగ్ తో ఇండియన్ సినిమాలో ఒక నూతన యుగం ప్రారంభమైంది. ప్రాంతీయ చిత్రంగా ఉన్నప్పటికీ, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గొప్ప విజయం సాధించింది మరియు భారతీయ సినిమా స్థాయిని పెంచింది. ఈ చిత్రం నాలుగు భాషల నుంచి 650 కోట్లు కలెక్ట్ చేసి ఐదో స్థానంలో నిలిచింది. 100 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ వసూలు చేసిన మొదటి హిందీ డబ్బింగ్ మూవీ కూడా.

  1. సుల్తాన్ (2016) – రూ. 589.25 కోట్లు

సల్మాన్ ఖాన్ మరియు అనుష్క శర్మ నటించిన రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం సుల్తాన్. 2016 ఈద్ లో విడుదలైన ఈ చిత్రం సుల్తాన్ అలీ ఖాన్, తన వ్యక్తిగత జీవితంలో అవాంతరాలు ఎదుర్కొంటున్న ఒక విజయవంతమైన మల్లయోధుడి జీవితాన్ని గురించి. ఈ చిత్రం Box Office వద్ద 589.25 కోట్లు గ్రాస్ సాధించి 7 వ స్థానంలో నిలిచింది.

  1. ధూమ్ 3 (2013) – రూ. 589.2 కోట్లు

ధూమ్ సిరీస్ లో మూడవ భాగం అమీర్ ఖాన్ అభిషేక్ బచ్చన్ మరియు ఉదయ్ చోప్రాతో కలిసి విలన్ పాత్రలో నటించించారు. ఈ చిత్రం Box Office వద్ద మొత్తం రూ 589.2 కోట్లు కలెక్ట్ చేసింది.

  1. పద్మావత్ (2018) – రూ. 585 కోట్లు

సంజయ్ లీలా భన్సాలి యొక్క చారిత్రాత్మక ఎపిక్ డ్రామా పద్మవవత్ చిత్రం యొక్క మేకింగ్ వివాదాస్పదమైoది. దీపికా పడుకొనే, రణవీర్ సింగ్ మరియు షాహిద్ కపూర్ నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులచే ఎంతో ప్రశంసలు పొందింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద విజయవంతంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 585 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది.

  1. టైగర్ జిందా హై (2017) – రూ. 570 కోట్లు

సల్మాన్ ఖాన్ తో సుల్తాన్ మూవీతో కలిసి పనిచేసిన డైరెక్టర్ అలీ అబ్బాస్ జఫర్, రెండో సారి సల్మాన్ తో జతకట్టారు. యాక్షన్-ప్యాక్ చలన చిత్రం టైగర్ జిందా హైలో ఎక్కువ మంది నచ్చిన జంట సల్మాన్ ఖాన్ మరియు కత్రీనా కైఫ్ వెండి తెరపై మేజిక్ చేసారు. చైనా మార్కెట్ లో కూడా చిత్రం Box Office వద్ద విజయవంతంగా నడిచింది మరియు ప్రపంచవ్యాప్తంగా రూ. 570 కోట్లు కలెక్ట్ చేసింది.

  1. సంజు (2018) – 528.47 కోట్లు

బాలీవుడ్ బయోగ్రఫికల్ చలనచిత్రం సంజు. ఈ చలన చిత్రం నటుడు సంజయ్ దత్ యొక్క సంక్లిష్ట జీవితం ఆధారంగా రూపొందించబడింది. రణబీర్ కపూర్ సంజయ్ దత్ పాత్ర పోషించాడు మరియు అనేక మంది హృదయాలను గెలుచుకున్నాడు. రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వం వహించిన సంజు సినిమా 2018 లో రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన క్లబ్ లోకి ప్రవేశించిన భారతీయ చిత్రం మరియు అల్ టైం నాల్గవ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రం.

  1. 3ఇడియట్స్ (2009) – రూ. 459.96 కోట్లు

అమీర్ ఖాన్ మరియు రాజ్ కుమార్ హిరానీ కాంబోలో వచ్చిన మూవీ 3ఇడియట్స్ . 2009 లో చేతన్ భగత్ యొక్క నవల ఫైవ్ పాయింట్ నుండి ఇన్సపైర్ అయ్యి తీసిన ఈ మూవీ భారీ విజయం సాధించింది. 3 ఇడియట్స్ లో ఆర్ మాధవన్, షర్మాన్ జోషి, కరీనా కపూర్ మరియు బోమన్ ఇరానీలు కూడా ఉన్నారు. సినిమా రూ. 459.96 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది పదకొండవ స్థానంలో నిలిచింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button