Tollywood news in telugu

toofan trailer :పర్హాన్ అక్తర్ క్యారెక్టర్ కోసం చాలా కష్టపడుతాడంటూ…మహేశ్ బాబు ప్రశంసలు…!

toofan trailer

toofan trailer  : ప్రముఖ బాలీవుడ్ నటుడు ‘పర్హాన్ అక్తర్’ ‌పై మన సూపర్ స్టార్ మహేశ్‌ బాబు పొగడ్తలతో ముంచేశాడు. అయితే ఈ మధ్యన  పర్హాన్ అక్తర్ హీరోగా నటించిన ‘తుఫాన్’ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది . ఈ ట్రైలర్ చూసిన మహేశ్ బాబు ట్విట్టర్ ద్వారా ట్రైలర్ చాల బాగుందని,  పర్హాన్ క్యారెక్టర్‌ను తగ్గట్టు చాలా కష్టపడుతుతున్నాడని  పొగుడుతూ తన అభిప్రాయాన్ని తెలిపాడు.

అదేవిదంగా పర్హాన్ అక్తర్ గురించి తన ట్వీట్ లో ఇతను తన క్యారెక్ట  గురించి చాలా కష్టపడతాడని కితాబిచ్చాడు. గతంలో అక్తర్  హీరోగా వచ్చిన ‘భాగ్‌ మిల్కా భాగ్‌’  ప్రేక్షకులను ఏవిదంగా ఆకట్టుకుందో అందరికి తెలిసిందే, ఇపుడు  తాజాగా అక్తర్  హీరోగా నటిస్తున్న ‘తుఫాన్’ చిత్రం లో  బాక్సర్‌గా మనముందుకు రాబోతున్నాడు. ఈ క్యారెక్టర్ కోసం తనెంత కష్టపడ్డాడో టీజర్ చుస్తే అర్థమవుతుంది.

ఇప్పటికే మహేష్ బాబు తో సహా  బాలీవుడ్‌ స్టార్స్ షారుక్‌, సల్మాన్‌లు కూడా అక్తర్  ను పొగడ్తలతో ముంచేశారు. ఈ ముగ్గురు అక్తర్  ని మెచ్చుకున్నారంటే తాను ఒక పాత్రకోసం ఎంతగా కష్టపడుతాడో తెలుస్తుంది. తుఫాన్‌ టీజర్ చూస్తుంటే ప్రారంభంలో గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించిన ఫర్హాన్.. ఆ తర్వాత బాక్సర్‌గా మారినట్టు తెలుస్తోంది.

‘అజ్జు.. ఓ గ్యాంగ్‌స్టర్, అజీజ్ అలీ.. ఓ బాక్సర్.. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో చాయిస్ నీదే’ అని హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ ఫర్హాన్‌తో అంటుంది. ఈ  మాటల బట్టి .. తను హీరోను గైడ్ చేసే పాత్రలో నటిస్తున్నట్టు  తెలుస్తోంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button