Tollywood Top 2 Music Directors with NTR : టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ని టెన్షన్ లో పెట్టిన ఎన్టీఆర్ :-

Tollywood Top 2 Music Directors with NTR : అవును మీరు చదివింది మేము రాసింది నిజమే. జూనియర్ ఎన్టీఆర్ గారు టాలీవుడ్ లోని టాప్ 2 మ్యూజిక్ డైరెక్టర్స్ తో ఓ రేంజ్ లో ఆడుకొని , వారిని టెన్షన్ లో పెట్టి ప్రేక్షకులని ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. ఇప్పటికే మీకు మ్యాటర్ అర్ధం అయిపోయింటది.
అదేనండి జూనియర్ ఎన్టీఆర్ గారు టీవీ లో చేసే షో ఎవరు మీలో కోటీశ్వరులు. ఈ షో లో ఇప్పటికే చాల మంది గెస్ట్స్ వచ్చి చారిటీ కోసం ఆడిన విషయం మనందరికీ తెలిసిందే. ఇంకా మహేష్ బాబు తో చేసిన ఎపిసోడ్ టెలికాస్ట్ చేయాల్సి ఉంది. కాకపోతే మహేష్ బాబు తో చేసిన ఎపిసోడ్ షో ఎండింగ్ ఎపిసోడ్ లా టెలికాస్ట్ చేసేందుకు వేచి ఉన్నారని అర్ధం అయింది.
అయితే ఇపుడు ఎన్టీఆర్ షో లో సడన్ గా టాప్ 2 టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారు. వారెవరో కాదు థమన్ మరియు దేవిశ్రీ ప్రసాద్. ఈసారి ఎన్టీఆర్ తో కలిసి ఎవరు మీలో కోటీశ్వరులు షో ఆడేందుకు వీరిద్దరూ కలిసి రావడం జరిగింది.
ఎన్టీఆర్ గారి గురించి తెలిసిందే గా సెలబ్రిటీస్ ఎవరు వచ్చిన తన స్టైల్ అఫ్ కామెడీ తో వారిని నవ్విస్తూనే టెన్షన్ లో పడేస్తారు. అదే పరిస్థితి ఇపుడు దేవిశ్రీ ప్రసాద్ కి మరియు థమన్ కి కలిగింది. ఇద్దరిని ఎన్టీఆర్ ఓ రేంజ్ లో ఆడుకున్నట్లు టాక్.
ఈ దీపావళి కానీ వచ్చే వారం కానీ టెలికాస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. చూడాలి మరి ఈ ఎపిసోడ్ ఎపుడు టెలికాస్ట్ చేస్తారో.. ఎన్టీఆర్ గారు దేవిశ్రీప్రసాద్ ని మరియు థమన్ ని ఏ రేంజ్ లో రోస్ట్ చేసారో వేచి చూడక తప్పదు.